MoviesSamantha "లైఫ్ లో మరోసారి ఆ తప్పు చేయను".. ఇన్నాళ్లకు...

Samantha “లైఫ్ లో మరోసారి ఆ తప్పు చేయను”.. ఇన్నాళ్లకు సమంతకు బుద్దొచ్చిందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత .. ప్రెసెంట్ పలు వెబ్ సిరీస్ ల తో బిగ్ ప్రాజెక్టులతో దూసుకుపోతుంది . మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత.. ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండింది . కాగా రీసెంట్ గానే ఆమె తన జబ్బు నుండి కోలుకోవడంతో.. మళ్లీ యధావిధిగా రొటీన్ లైఫ్ని స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సిటాడెల్ సిరీస్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

కాగా ఈ క్రమంలోనే మరోసారి అమ్మడు తన వద్దకు వచ్చిన భారీ ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మనకు తెలిసిందే పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప2 సినిమాలో బిజీగా ఉన్నాడు . రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ పుష్ప 2 సినిమాలో సాయి పల్లవి కీలక రోల్ లో కనిపించబోతుందని తెలుస్తుంది. కాగా పుష్ప 1 లో ఐటెం సాంగ్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సమంత ..పుష్ప2లో కూడా ఐటమ్ సాంగ్ చేయాలని ప్రత్యేకంగా సుకుమార్ – అల్లు అర్జున్ రిక్వెస్ట్ చేశారట .

అయితే పుష్ప1కి చేసిన తప్పును పుష్ప 2 కు చేయను అని ..సమంత ఐటెం సాంగ్ ను సున్నితంగా రిజెక్ట్ చేసారట. “ఇకపై నా కెరియర్లో ఐటెం సాంగ్స్ చేయను ..పుష్ప1 నే ఫస్ట్ అదే లాస్ట్ “అంటూ తెగేసి చెప్పిందట. ఈ క్రమంలోనే ఈ న్యూస్ తెలుసుకున్న అక్కినేని ఫ్యాన్స్ ఇన్నాళ్లకు నీకు బుద్ధొచ్చిందా..? ఈ బుద్ధి ముందుంటే అక్కినేని ఇంటి కోడలు గానే ఉండే దానివిగా ..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు సమంత ఇంపార్టెంట్ కంటెంట్ ఉన్న పాత్రలను చూస్చేసుకొని చేస్తుందని ఇలా ఐటెం సాంగ్స్ చేయడానికి సిద్ధపడట్లేదని చెప్పుకొస్తున్నారు. సమంత ఇలా చేసి మంచి పని చేసిందని సమంత అభిమానులు..అక్కినేని అభిమానులు సంతోషపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news