Moviesమూడు హిట్లు కొట్టినా .. అనుపమ చూస్తే ఆ మూడ్ రావట్లేదే..ఎందుకబ్బా..?

మూడు హిట్లు కొట్టినా .. అనుపమ చూస్తే ఆ మూడ్ రావట్లేదే..ఎందుకబ్బా..?

అనుపమ పరమేశ్వరణ్.. ప్రజెంట్ పేరు సినీ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది . దానికి మెయిన్ రీజన్ అనుపమ పరమేశ్వరన్ బ్యాక్ టు బ్యాక్ వరుసగా మూడు హీట్లను తన ఖాతాలో వేసుకోవడమే . పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన కార్తికేయ 2తో ఫస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత నిఖిల్ తో 18 పేజీస్ అంటూ మరో సినిమాను రిలీజ్ చేసింది .

ఈ సినిమా కూడా ఎవరు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది . ఇక నేరుగా ఓటీడీలో లేడీ ఓరియంటెడ్ ఫిలిం గా బటర్ ఫ్లై అనే సినిమాను రిలీజ్ చేసింది . ఆశ్చర్యం ఏంటంటే హీరో లేకపోయినా సరే అనుపమ పరమేశ్వరణ్ సింగిల్ గా నటించి హిట్ కొట్టింది. ఈ క్రమంలోనే వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్ లు కొట్టిన అనుపమ పరమేశ్వరన్.. ను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు కుర్రాళ్ళు .

అయితే స్టార్ హీరోలు కూడా ప్రశంసలతోనే సరిపెట్టుకుంటున్నారు కానీ.. అనుపమ పరమేశ్వరన్ కు అవకాశాలు ఇవ్వట్లేదు . దానికి మెయిన్ రీజన్ అనుపమ పరమేశ్వరన్ హోమ్లీ బ్యూటీ అన్న ట్యాగ్ వేసుకోవడమే . కచ్చితంగా ఇప్పటి కథలో హద్దులు మీరి రొమాంటిక్ లుక్స్ , ముద్దులు పెడితేనే సినిమా హిట్ అవుతుంది . మరి అనుపమ పరమేశ్వరన్ అలాంటి రోల్స్ చేయదని అందరికీ తెలిసిందే. దీంతోనే అనుపమ పరమేశ్వరన్ స్టార్ హీరో సినిమాల్లో అవకాశాలు అందుకోలేకపోతుందన్నారు గట్టిగా వినిపిస్తుంది . చూడాలి మరి డైరెక్టర్స్ కోసం అనుపమ మారుతుందో అనుపమ లాంటి మంచి హీరోయిన్ కోసం డైరెక్టర్లే కథను మారుస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news