Moviesభార్య న‌మ్ర‌త‌పై ఎమోష‌న‌ల్ ప్రేమ చూపించిన మ‌హేష్‌... హార్ట్ ట‌చ్చింగ్ మెసేజ్‌..!

భార్య న‌మ్ర‌త‌పై ఎమోష‌న‌ల్ ప్రేమ చూపించిన మ‌హేష్‌… హార్ట్ ట‌చ్చింగ్ మెసేజ్‌..!

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ ప్రిన్స్ మ‌హేష్‌బాబు గ‌తేడాది స‌ర్కారు వారి పాట సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. మ‌హేష్ రేంజ్‌కు త‌గ్గ హిట్ కాక‌పోయినా సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర గ‌ట్టెక్కేసింది. భ‌ర‌త్ అనేనేను – మ‌హ‌ర్షి – స‌రిలేరు నీకెవ్వ‌రు, స‌ర్కారు వారి పాట సినిమాల హిట్ల‌తో మ‌హేష్ కెరీర్‌కు వ‌చ్చిన ఇబ్బంది లేదు. అయితే అదిరిపోయే ఇండ‌స్ట్రీ హిట్ ఒక‌టి అయితే ఇప్పుడు మ‌నోడికి త‌ప్ప‌కుండా కావాలి.

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌స్తుతం మ‌హేష్ చేస్తోన్న త‌న 28వ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. గ‌తంలో వీరి కాంబోలో వ‌చ్చిన అత‌డు, ఖ‌లేజా త‌ర్వాత ఇప్పుడు వ‌స్తోన్న మూడో సినిమా ఇది. ఖ‌లేజా 2010లో వ‌చ్చి ప్లాప్ అయ్యింది. ఇప్పుడు 12 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ వీరి కాంబినేష‌న్ రిపీట్ అవ్వ‌డంతో ఖ‌చ్చితంగా ఇది అస‌లు సిస‌లు ఇండ‌స్ట్రీ హిట్ అవుతుంద‌నే అంద‌రూ లెక్క‌లు వేస్తున్నారు.

ఇక తాజాగా ఈ రోజు త‌న భార్య బ‌ర్త్ డే సంద‌ర్భంగా మ‌హేష్ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపాడు. హ్యాపీ బ‌ర్త్ డే ఎన్ఎస్జీ అని పెట్టాడు. అంటే న‌మ్ర‌తా శిరోద్క‌ర్ ఘ‌ట్ట‌మ‌నేని అన్న‌దే దాని అర్థం. నా కోసం అన్ని ప‌నుల‌ను చాలా లైన్లో, క్ర‌మంగా పెడుతున్నందుకు ధ‌న్య‌వాదాలు. న‌న్ను ఎప్ప‌ట‌కీ మ‌రింత ముందుకు న‌డిపిస్తున్నందుకు ఎప్పుడూ నువ్వు నీలాగానే ఉన్నందుకు థ్యాంక్స్ అని బాగా ఎమోష‌న‌ల్ అయిపోయాడు.

ఈ మెసేజ్‌కు న‌మ్ర‌త అంద‌మైన ఫొటో షేర్ చేసి.. దానికి క్యాప్ష‌న్ పెడుతూ బ‌ర్త్ డే విషెస్ చెప్పాడు. ఇక న‌మ్ర‌త – మ‌హేష్ బంధం 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2005లో వీరి పెళ్లి ముంబైలో జ‌రిగింది. ఆ త‌ర్వాత వంశీ సినిమాలో క‌లిసి న‌టిస్తోన్న టైంలో వీరు స్నేహితులుగా మారి.. పెళ్లి చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు సితార‌, గౌత‌మ్ అనే పిల్ల‌లు ఉన్నారు.

ఇక న‌మ్ర‌త‌.. మ‌హేష్ లైఫ్‌లోకి ఎంట‌ర్ అయ్యాక మ‌నోడి కెరీర్ ప‌రంగా ఎన్నో మార్పులు, చేర్పులు వ‌చ్చాయి. మ‌హేష్ సినిమాల క‌థ‌లు విన‌డం, డేట్లు చూసుకోవ‌డం… సినిమా ప్ర‌మోష‌న్లు కొత్త పుంత‌లు తొక్కించ‌డంలో న‌మ్ర‌త ఎప్ప‌టిక‌ప్పుడు కీల‌కంగా ఉంటోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news