Moviesఆ విషయంలో..మహేష్ కొడుకు కన్నా..బన్నీ కూతురే పెద్ద తోపా ..?

ఆ విషయంలో..మహేష్ కొడుకు కన్నా..బన్నీ కూతురే పెద్ద తోపా ..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ కంటే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ..ఉందని జనాలు చెప్పుకొస్తున్నారు . మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ చాలా కామన్ ఇప్పటికే చాలామంది స్టార్స్ ..స్టార్ హీరో పిల్లలు అలానే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తమ లైఫ్ ని ముందుకు తీసుకెళ్తున్నారు .

కాగా ప్రజెంట్ ఉండే హీరోలు కూడా తమ నెక్స్ట్ జనరేషన్ కి సంబంధించిన పిల్లలను సినిమా ఇండస్ట్రీలోకి దించుతూ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకుంటున్నారు . కాగా ఇదే క్రమంలో మహేష్ కొడుకు గౌతమ్ కూడా మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాలో ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో నటించి మెప్పించాడు . సుకుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు. ఈ సినిమాకి పెద్దగా పబ్లిసిటీ దక్కలేదు . మహేష్ బాబు పేరు ఎక్కువగా వినిపించింది కానీ గౌతమ్ పేరు చాలా తక్కువగా వినిపించింది . అంతే కాదు ఇప్పటికీ ఈ సినిమాలో గౌతమ్ నటించాడు అన్న విషయం చాలామందికి తెలియదు .

 

బన్నీ కూతురు టాలీవుడ్ లోకి తెరంగేట్రం చేస్తున్న సినిమా శాకుంతలం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 17న గ్రాండ్గా థియేటర్స్ లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా కోసం తండ్రి అల్లు అర్జున్ తల్లి స్నేహ రెడ్డి అల్లు అర్హ కి ఇస్తున్న బూస్టప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రీసెంట్గా ఈ సినిమాకి డబ్బింగ్ చెబుతూ సోషల్ మీడియాలో పాప పిక్స్ ని షేర్ చేస్తూ తెగ ప్రమోట్ చేస్తున్నారు బన్నీ – స్నేహ.

ఈ క్రమంలోని సోషల్ మీడియాలో మహేష్ బాబు కొడుకు గౌతమ్ కంటే బన్నీకూతురు అల్లు అర్హకే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అని .. ఆ విషయంలో ఆమె పెద్ద తోపు అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు బన్నీ కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పుష్ప2 సినిమాలో కూడా బన్నీ కూతురు అల్లు అర్హ ఓ పాత్రలో నటించబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రాబోయే కాలంలో అర్హా సినీ ఇండస్ట్రీని షేక్ చేసే హీరయిన్ గా అవుతుంది అంటూ బన్నీ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news