Moviesఫైనలీ..క్రేజీ కాంబో ని ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి ..బాలయ్య తో...

ఫైనలీ..క్రేజీ కాంబో ని ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి ..బాలయ్య తో ఆ బ్యూటీ ఫిక్స్..!!

టాలీవుడ్ నందమూరి బాలయ్య రీసెంట్ గా నటించిన సినిమా వీరసింహారెడ్డి. మల్టీ టాలెంటెడ్ గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నమోదు చేసుకుంది . అంతేకాదు రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే 100 కోట్లు దాటేసి .. బాలయ్య కెరియర్ లోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది . ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించిన శృతిహాసన్ , హనీ రోజ్ ఇద్దరు మంచి మార్కులు వేయించుకున్నారు .

ప్రజెంట్ బాలయ్య – అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కే సినిమాలో బిజీగా ఉన్నాడు . గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక జవాల్కర్ నటిస్తుంది అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఎవరు ఊహించిన విధంగా అనిల్ రావిపూడి ఈ సినిమా నుంచి ఆమెను తప్పించి అందాల ముద్దుగుమ్మ కాజల్ ని ఈ ప్లేస్లోకి ఫిక్స్ చేసారట .

ఆల్రెడీ ఇప్పటికే రెండుసార్లు నందమూరి బాలకృష్ణ – కాజల్ అగర్వాల్ కాంబో మిస్ అయ్యింది. ఈసారి మాత్రం ఈ కాంబోని ఫిక్స్ చేసి అనిల్ సినిమా పై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసారు. ఈ సినిమాల్లో బాలయ్య కూతురుగా శ్రీలీల నటిస్తుంది . అంతేకాదు ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో అందాల ముద్దుగుమ్మ స్నేహ నటించబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

భారీ తారగాణం తో పక్క హిట్ అందుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు అనిల్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . కాగా ఈ సినిమా మొత్తం కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది . త్వరలోనే కాజల్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . దీనిపై అధికారికంగా మరి కొద్ది రోజుల్లోనే ప్రకటన వెలవడే అవకాశం కనిపిస్తుంది ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news