Moviesబ్యాక్ టూ బ్యాక్ హిట్లు..శృతి కి తలపోగరు నెత్తికెక్కిందా..? తెలుగు హీరో...

బ్యాక్ టూ బ్యాక్ హిట్లు..శృతి కి తలపోగరు నెత్తికెక్కిందా..? తెలుగు హీరో సినిమాకి అలాంటి కండీషన్స్ న్యాయమేనా..?

ప్రజెంట్ ఇండస్ట్రీలో శృతిహాసన్ రేంజ్ ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిందే. నిన్న మొన్నటి వరకు ఒక అవకాశం అందుకోవడానికి నానా తంటాలు పడిన అమ్మడు.. రీసెంట్గా రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను బ్యాక్ టు బ్యాక్ తన ఖాతాలో వేసుకునేసరికి హెడ్ వెయిట్ పెరిగిపోయింది అంటున్నారు జనాలు. దానికి మెయిన్ రీజన్ తన వద్దకు వస్తున్న డైరెక్టర్ ల కు అమ్మడు షాకింగ్ కండిషన్స్ పెడుతూ ఉండడమే అంటూ తెలుస్తుంది .

మనకు తెలిసిందే కమలహాసన్ ముద్దుల కూతురుగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన స్టార్ డాటర్ శృతిహాసన్ ..మొదటి హిట్ కొట్టడానికి చాలా టైం తీసుకుంది . ఫైనల్లీ ఎట్టకేలకు హరీష్ ఇంకా డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో మొదటి హిట్టును తన ఖాతాలో వేసుకుంది . ఇక తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శృతి రీసెంట్గా వీరసింహారెడ్డి – వాల్తేరు వీరయ్య సినిమాల్లో నటించి రెండు బడా బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.

కాగా ఈ రెండు సినిమాలు హిట్ కావడంతో శృతి రెమ్యూనరేషన్ పెంచేయడమే కాకుండా సినిమాకి సంబంధించి కొన్ని కండిషన్స్ పెట్టుకోస్తుందట.ఇదే క్రమంలో రీసెంట్గా శృతి వద్దకు వెళ్ళిన తెలుగు డైరెక్టర్ కి శృతి పెట్టిన కండిషన్స్ కి దిమ్మ తిరిగిపోయి వెనక్కి వచ్చేసాడంటూ న్యూస్ వైరల్ అవుతుంది. మంచి కథ కంటెంట్ ఉన్న సినిమాతో శృతిహాసన్ దగ్గరకు వెళ్తే రెమ్యూనరేషన్ ఏకంగా ఆరు కోట్లు చేయడమే కాకుండా.. కాల్ షీట్స్ లిమిటెడ్ గానే ఇస్తుందిట‌.

అలాగే హీరోతో రొమాంటిక్ సీన్స్ చేయనని ..కచ్చితంగా డాన్స్ విషయంలో ఇలాంటి కేరింగ్ తీసుకోవాలని.. కాస్ట్యూమ్స్ విషయంలో కూడా తాను చెప్పిన డిజైనర్ ని సెలెక్ట్ చేయాలని బోలెడు కండిషన్స్ పెట్టిందట . దీంతో నిన్న మొన్నటి వరకు అవకాశాల కోసం అల్లాడిన శృతి రెండు హిట్లు పడేసరికి ఇంత ఓవర్ చేయడం న్యాయమా అంటున్నారు జనాలు. అంతేకాదు ఆ రెండు సినిమాల హిట్ అయినా నీ పాత్ర శూన్యం అని నీకు తెలుసు ..మరి ఇలా ఓవర్ చేయడం న్యాయమా అంటూ నెటిజన్స్ ఓపెన్ గానే అడిగేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news