Movies' వీర‌సింహా ' కు ప‌వ‌ర్ ఫుల్ టాక్‌... ' అఖండ‌...

‘ వీర‌సింహా ‘ కు ప‌వ‌ర్ ఫుల్ టాక్‌… ‘ అఖండ‌ ‘ ను మించి బాల‌య్య న‌ట విశ్వ‌రూపం..!

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వీర‌సింహారెడ్డి. శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మించింది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. సంక్రాంతికి వ‌స్తోన్న మిగిలిన సినిమాల‌తో పోలిస్తే వీర‌సింహారెడ్డికే ఎక్కువ బ‌జ్ క‌నిపిస్తోంది.

 

ఒంగోలులో ఈ రోజు జ‌రిగే ప్రి రిలీజ్ ఈవెంట్‌పై కూడా మామూలు అంచ‌నాలు లేవు. ట్రైల‌ర్ కూడా ఈ రోజే వ‌స్తోంది. ట్రైల‌ర్ వ‌చ్చాక సినిమాపై ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న హైప్ డ‌బుల్ కానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టికే మాట‌ల ర‌చ‌యిత బుర్రా సాయిమాధ‌వ్‌తో పాటు డీవోపీ రిషి పంజాబీ, డైరెక్ట‌ర్ మ‌లినేని గోపీచంద్ చెప్పిన రివ్యూల‌తో బాల‌య్య ఫ్యాన్స్ ముందుగానే సంబ‌రాలు చేసుకుంటున్నారు.

ఈ క్ర‌మంలోనే ఈ సినిమాలో విల‌న్‌గా న‌టించిన క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ సైతం సినిమాకు అదిరిపోయే రిపోర్ట్ ఇచ్చారు. అస‌లు ఈ సినిమాలో త‌న పాత్ర గురించి తెలిసిన‌ప్పుడే తాను చాలా థ్రిల్ పీల‌య్యాన‌ని.. ఈ సినిమాలో విల‌న్ పాత్ర ఓ పిల్ల‌ర్‌లా ఉంటుంద‌ని.. ప్రేక్ష‌కుల‌కు ఎప్పట‌కీ గుర్తుండిపోయే పాత్ర ఇది అని విజ‌య్ తెలిపారు.

అస‌లు ఈ పాత్ర‌కు న‌న్నే ఎందుకు తీసుకున్నార‌ని ద‌ర్శ‌కుడిని అడిగాన‌ని.. గోపీచంద్ గ‌తంలో నా వ‌ర్క్ చూసి.. ఈ పాత్ర‌కు తాను అయితేనే స‌రిపోతాన‌ని తీసుకున్నార‌ని విజ‌య్ తెలిపారు. ఇది ల‌క్‌, గుడ్ టైం.. ఈ సినిమాలో నా లుక్ చాలా మొర‌టుగా ఉంటుంది.. స్క్రీన్‌పై చాలా కొత్త‌గా ఉంటుంది.. వీర‌సింహారెడ్డిలో నా పాత్ర పేరు ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి అంటూ సినిమాపై మ‌రింత హైప్ పెంచాడు దునియా విజ‌య్‌.

సినిమా క‌థ అంతా చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటుంద‌ని.. ఫైట్లు కూడా ప‌వ‌ర్ ఫుల్‌గానే ఉంటాయ‌ని.. ప్రేక్ష‌కులు థియేట‌ర్లో సినిమా చూస్తున్న‌ప్పుడు ఆ ఎన‌ర్జీని ఫీల‌వుతార‌ని ఆయ‌న తెలిపారు. ఇక ఓవ‌రాల్ టాక్ ప్ర‌కారం సినిమాలో బాల‌య్ న‌ట విశ్వ‌రూపం అఖండ‌ను మించిపోయేలా ఉంటుంద‌నే ఎక్కువ మంది చెపుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news