Moviesమ‌హేష్ భార్య న‌మ్ర‌త‌పై చిరంజీవి సెన్షేష‌న‌ల్ కామెంట్స్ ఇవే...!

మ‌హేష్ భార్య న‌మ్ర‌త‌పై చిరంజీవి సెన్షేష‌న‌ల్ కామెంట్స్ ఇవే…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ తెలుగులో రెండు సినిమాల్లో నటించింది. 2000లో మహేష్ బాబు హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో పద్మాలయ స్టూడియోస్ బ్యాన‌ర్ పై తెరకెక్కిన వంశీ సినిమాలో నమ్రత.. మహేష్ కు జోడిగా నటించింది. మహేష్ కు కెరీర్ పరంగా ఇది మూడో సినిమా.
ఈ సినిమా డిజాస్టర్ అయింది. అంచనాలు ఏమాత్రం అందుకోలేదు. అయితే ఈ సినిమాలో తనకు జోడిగా నటించిన మాజీ మిస్ ఇండియా నమ్రత శిరోద్క‌ర్ తో ప్రేమలో పడిన మహేష్ తన జీవిత భాగస్వామిని చేసుకున్నాడు.

అయితే ఈ సినిమా కంటే ముందే నమ్రత మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన అంజి సినిమాలో నటించింది. శ్యాం ప్రసాద్ రెడ్డి భారీ బడ్జెట్ తో కోడి రామకృష్ణ దర్శకత్వంలో నిర్మించిన అంజి సినిమా 2004 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కడంతో పాటు ఆరేడు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు.
అయితే అంజి సినిమా ప్రస్తావన ఎప్పుడు వచ్చినా కూడా మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్‌గా చేసిన నమ్ర‌త‌ పై ప్రశంసల వర్షం కురిపిస్తారు.

ఈ సినిమా ఏకంగా ఆరేడు సంవత్సరాల పాటు షూటింగ్ జరుపుకుందని.. షూటింగ్లో ఎంతో జాప్యం జరగడంతో పాటు బడ్జెట్ కూడా పెరిగిందని.. అయితే సినిమా ఎన్నిసార్లు వాయిదా పడిన ఐదేరేళ్ల‌పాటు షూటింగ్ జరుపుకున్నా ఎప్పుడు షూటింగ్ కి రావాలని చెప్పినా కూడా నమ్రత ఎంతో వినమ్రతతో వచ్చి ఓపికతో షూటింగ్లో పాల్గొందని.. ఆమె ఓపిక ప్రశంసనీయం అంటూ చిరంజీవి చాలాసార్లు పొగడ్తల వర్షం కురిపించారు.

సినిమా ఇంత లేట్ అయినందుకు మరో హీరోయిన్ ఎవరైనా అయితే షూటింగ్ కు రారని.. కానీ అంజి సినిమా మేకర్స్ ఎప్పుడు కోరినా కూడా నమ్రత ముంబై నుంచి వచ్చి.. ఎంతో కష్టంతో ఓపికతో షూటింగ్లో పాల్గొంద‌ని కొనియాడారు. కొన్నిసార్లు అడవుల్లో షూటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఓపికతో ఆమె షూటింగ్లో పాల్గొంద‌ని చిరంజీవి మెచ్చుకున్నారు.

అంజి సినిమా రిలీజ్ చాలా ఆలస్యం అయింది. అప్పటికే నమ్రత – మహేష్ తో పీకల్లోతు ప్రేమలో ఉంది. వాస్తవానికి అంజి రిలీజ్ అయ్యాకే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అందుకే ఐదేళ్లపాటు నమ్రత – మహేష్ ప్రేమించుకుంటూనే ఉన్నారు. చివరకు అంజి రిలీజ్ అయిన మరుసటి ఏడాది మీరిద్దరూ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news