MoviesNBK 108లో సోనాక్షిసిన్హా... ఇన్‌స్టా పోస్టుతో ఫుల్ క్లారిటీ...!

NBK 108లో సోనాక్షిసిన్హా… ఇన్‌స్టా పోస్టుతో ఫుల్ క్లారిటీ…!

బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్‌, సీనియ‌ర్ న‌టుడు శ‌తృఘ్నుసిన్హా కుమార్తె అయిన సోనాక్షి సిన్హా కండ‌ల‌వీరుడు స‌ల్మాన్‌ఖాన్ దబాంగ్ సినిమాతో వెండి తెరంగేట్రం చేసింది. ఆ సినిమాతో ఆమె ఒక్క‌సారిగా నేష‌న‌ల్ వైడ్‌గా పాపుల‌ర్ అయ్యింది. ఆ త‌ర్వాత ర‌జ‌నీకాంత్ లింగా సినిమాతో సౌత్ ఇండియాలో కూడా ఫేమ‌స్ అయ్యింది. ఆ త‌ర్వాత ఆమె ఏ సౌత్ ఇండియ‌న్ సినిమాలోనూ క‌న‌పించ‌లేదు. ఆమెను సౌత్ సినిమాల్ల న‌టింప‌జేసేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా అవి స‌క్సెస్ కాలేదు.

ఆమె రీసెంట్‌గా న‌టించిన డబుల్ XL ప్లాప్ అయ్యింది. అయితే ఇప్పుడు ఆమె అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య న‌టిస్తోన్న 108వ సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైంద‌న్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ వార్త‌ల‌పై ఈ సినిమా మేక‌ర్స్ స్పందించ‌లేదు. ఈ వార్త‌లు అటు బాలీవుడ్‌లో కూడా వైర‌ల్ కావ‌డంతో సోనాక్షి త‌న ఇన్‌స్టా స్టోరీతో క్లారిటీ ఇచ్చేసింది.

తాను తెలుగులో న‌టిస్తున్నాన‌ని వ‌స్తోన్న వార్త‌ల్లో నిజం లేద‌ని.. ఈ సినిమా నుంచి త‌న‌ను త‌ప్పించిన‌ట్టుగా కూడా వార్త‌లు రాస్తున్నార‌ని వ‌చ్చిన క‌థ‌నాల‌పై కూడా ఆమె ఫైర్ అయ్యింది. ఈ సినిమాలో న‌టించ‌మ‌ని కూడా త‌న‌ను మేక‌ర్స్ ఎప్పుడూ అడ‌గ‌లేద‌ని… త‌న‌ను సంప్ర‌దించ‌నూ లేద‌ని ఇవ‌న్నీ అబద్ధం అని క్లారిటీ ఇచ్చింది. దీంతో బాల‌య్య సినిమాలో సోనాక్షి అంటూ వ‌స్తోన్న వార్త‌ల‌కు చెక్ ప‌డిన‌ట్ల‌య్యింది.

ఇక అనిల్ రావిపూడి – బాల‌య్య సినిమా ఈ నెల చివ‌రి వారం నుంచే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. బాల‌య్య కోసం అనిల్ త‌న కామెడీ జాన‌ర్‌కు భిన్న‌మైన స్టోరీ రెడీ చేశాడు. ఈ సినిమాలో బాల‌య్య‌కు కూతురుగా యంగ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల న‌టిస్తోంది. వ‌చ్చే స‌మ్మ‌ర్‌కు రిలీజ్ చేసేలా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, చంటి పెద్ది ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news