Moviesఆ విష‌యంలో ప్ర‌భాస్ కంటే బాల‌య్యే బెటర్..అనవసరమైన మ్యాటర్ లో ...

ఆ విష‌యంలో ప్ర‌భాస్ కంటే బాల‌య్యే బెటర్..అనవసరమైన మ్యాటర్ లో వేళు పెట్టి గెలికిన న‌య‌నతార..!!

లేడీ సూపర్ స్టార్ నయనతార కనెక్ట్ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ అశ్విన్ శరవణన్ తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇందులో సత్య రాజ్, అనుపమ్ ఖేర్, వినయ్ రాయ్ తదితరులు కీలక పాత్రల‌ను పోషించారు. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయనతార భర్త ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివ‌న్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 22న ఈ మూవీ తెలుగు తమిళ భాషల్లో విడుదల కాబోతోంది.

 

యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. అయితే నయనతార ప్రమోషన్స్ కు ఎప్పుడు దూరంగా ఉంటుంది. కానీ ఈసారి తన సొంత బ్యానర్ కావడంతో కనెక్ట్ సినిమాను కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ ప్రమోట్ చేసే పనిలో పడింది. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలుగులో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూకు సుమ హోస్ట్‌ గా వ్యవహరించింది. ఈ సందర్భంగా నయన్ నుంచి సుమ ఎన్నో విషయాలను రాబట్టే ప్రయత్నం చేసింది.

ఈ ఇంట‌ర్వ్యూలో న‌య‌న‌తార టాలీవుడ్ స్టార్ హీరోల గురించి మాట్లాడింది. ఎన్టీఆర్ డాన్స్ అంటే త‌న‌కు చాలా ఇష్టమని, ప్రభాస్ ది పిల్లాడి మనస్తత్వం అని, అతడి అల్లరి తట్టుకోవడం కష్టమని తెలిపింది. ఈ క్ర‌మంలోనే బాలకృష్ణతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పమని సుమ ప్రశ్నించింది. బాలకృష్ణ, నయనతార జంటగా సింహ, శ్రీరామరాజ్యం, జై సింహ తదితర చిత్రాల్లో నటించారు. ఈ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే ఆన్ స్క్రీన్ పై బాలయ్య నయన్ జోడీకి మంచి మార్కులు పడ్డాయి. అయితే తాజా ఇంటర్వ్యూలో బాలయ్య పై న‌య‌న్ సంచలప‌ వ్యాఖ్యలు చేసింది.

బాలకృష్ణ సార్ తో కలిసి వివిధ ర‌కాల జోనర్స్ లో సినిమాలు చేశానని, ఆయ‌నతో కలిసి వర్క్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేని ఫీలింగ్ అని న‌య‌న్ చెప్పుకొచ్చింది. అలాగే సెట్స్ లో బాలకృష్ణ సార్‌ అంటే చాలామంది వణికిపోతుంటారని, కానీ ఆయన ఎంతో సరదా వ్యక్తని ఆమె పేరుకుంది. అంతేకాదు, ప్రభాస్ అల్లరి ముద్దు పిల్లలు కూడా పనికిరారు అని ఇంతకుముందు చెప్పాను. కానీ, ఆ విషయంలో ప్రభాస్ కంటే బాలయ్య తోపు అంటూ నయన్ వ్యాఖ్యానించింది. అలాగే బాలకృష్ణ స్వీటెస్ట్ పర్సన్ అని, సెట్స్ లో ఎంతో సరదాగా, ఇతరుల పట్ల కేరింగ్‌గా వ్యవహరిస్తారని తెలిపింది. దీంతో నయనతార కామెంట్స్ కాస్త‌ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news