Moviesఅప్పుడే ' వీర‌సింహారెడ్డి ' మానియా ఏ రేంజ్‌లో అంటే... హైద‌రాబాద్‌లో...

అప్పుడే ‘ వీర‌సింహారెడ్డి ‘ మానియా ఏ రేంజ్‌లో అంటే… హైద‌రాబాద్‌లో బాల‌య్య ఫ్యాన్స్ ర‌చ్చ చూడండి..!

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న సినిమా వీర సింహారెడ్డి. అఖండ సూపర్ హిట్ అయ్యాక బాలయ్య నుంచి సినిమా వస్తుందంటే ఎలాంటి ? అంచనాలు ఉంటాయో చెప్పక్కర్లేదు. పైగా క్రాక్ లాంటి సూపర్ హిట్ తీసిన మలినేని గోపీచంద్ దర్శ‌కుడు. ఇటు సూపర్ మాస్ హీరో.. సూపర్ మాస్ డైరెక్టర్ కాంబినేషన్ కలిసి వచ్చిన సీమ బ్యాక్ డ్రాప్. అలాగే సింహ – రెడ్డి పదాలు కూడా టైటిల్ లో ఉన్నాయి.

దీంతో కచ్చితంగా సినిమా సూపర్ హిట్ అవుతుందన్న అంచనాలు అయితే వచ్చేసాయి. బాలయ్యకు జోడిగా శృతిహాసన్ నటించ‌గా.. థ‌మ‌న్‌ మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ ఎంతో గ్రాండ్ గా ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్, మోషన్ పోస్టర్‌తో పాటు జై బాలయ్య సాంగ్ – సుగుణసుందరి సాంగ్ నందమూరి ఫ్యాన్స్‌ను మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి.

ఇప్పటివరకు రిలీజ్ అయిన రెడ్డి సాంగ్స్‌లో బాలయ్య స్టిల్స్, డ్యాన్స్ అదిరిపోయాయి. మాస్‌తో పాటు క్లాస్ కి కూడా ఈ రెండు సాంగ్స్ పిచ్చ పిచ్చగా న‌చ్చేయ‌డంతో ఆడియో కూడా అదిరిపోతుందని అంటున్నారు. ఇక సినిమా రిలీజ్‌కు మ‌రో 20 రోజుల టైం ఉంది. అయితే ఇప్ప‌టి నుంచే బాల‌య్య ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు.

ఇప్పటికే వీర‌సింహారెడ్డి స్టాండీస్ థియేట‌ర్ల ద‌గ్గ‌ర‌కు చేరిపోయాయి. హైద‌రాబాద్‌లో వీర‌సింహారెడ్డి రిలీజ్ అయ్యే థియేట‌ర్ల ద‌గ్గ‌ర బాల‌య్య అభిమానులు స్టాండీస్ ద‌గ్గ‌ర చేస్తోన్న హంగామా అయితే మామూలుగా లేదు. బాల‌య్య వీరాభిమానులు పూల‌దండ‌లు వేస్తూ ఫొటోలు దిగుతున్నారు. ఇప్పుడు ఇవి మామూలుగా వైర‌ల్ కావ‌డం లేదు. హైద‌రాబాద్‌లోని కూక‌ట్‌పల్లి భ్ర‌మ‌రాంబ థియేట‌ర్లో వీర‌సింహారెడ్డి స్టాండీస్ ఏర్పాటు చేయ‌డంతో అవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news