Moviesకృష్ణ ఫుడ్ డైట్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. మరణించే ముందు రోజు...

కృష్ణ ఫుడ్ డైట్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. మరణించే ముందు రోజు కూడా అదే..!!

టాలీవుడ్ సీనియర్ సూపర్ స్టార్ హీరో ఘట్టమనేని కృష్ణ ఈ తెల్లవారుజామున అనారోగ్య కారణంగా మరణించిన సంగతి తెలిసిందే . సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో నటించి కోట్ల మంది ప్రేక్షకులను సంపాదించుకున్న సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు. ఈ వార్తని విని ఘట్టమనేని ఫ్యాన్స్ జీర్నించుకోలేకపోతున్నారు . ఇప్పటికి సూపర్ స్టార్ కృష్ణ మనమధ్య ఉన్నారు అంటూ ఫీల్ అవుతున్నారు . మరి ముఖ్యంగా ఆయన కొడుకు మహేష్ బాబును ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు . మొదటి తరం బిడ్డలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణంరాజు, శోభన్ బాబు, కృష్ణ ఇలా ఐదుగురు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం సినీ ఇండస్ట్రీ చేసుకున్న ఓ పాపము అంటూ జనాలు బాధపడుతున్నారు .

కాగా ఇలాంటి టైంలోని సూపర్ స్టార్ కృష్ణకు సంబంధించిన పాత వీడియోలు ,ఇంటర్వ్యూలో ఆయన ఇష్టా ఇష్టాలు అన్ని వైరల్ గా మారాయి . కాగా ఇలాంటి క్రమంలో ఆయన ఫుడ్ కి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . సూపర్ స్టార్ కృష్ణ ఎంత హ్యాండ్సమ్ గా ఉండేవారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . అంత ఎందుకు మొన్న ఆయన మొదటి భార్య చనిపోయిన టైంలోను సూపర్ స్టార్ కృష్ణ చెక్కుచెదరని అందంతో కనిపించారు . వాళ్లందరికీ రచయిత తోటపల్లి మధు కృష్ణ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు.

 

సూపర్ స్టార్ కృష్ణ ఆహారపు అలావాట్లు బయటపెట్టి నేటితరం మిస్ అవుతున్న ఫుడ్ ని గుర్తు చేశారు . గూఢచారి 117 సినిమాల్లో పనిచేసిన రచయిత మధు కృష్ణ ..సూపర్ స్టార్ కృష్ణ ఫుడ్ విషయాలను బయటపెట్టారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ..”సూపర్ స్టార్ కృష్ణ ఫుడ్ డైట్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని ..చాలా హెల్ది అని.. ఆయన ఎప్పుడూ ఒకే టైపు డైట్ ని కంటిన్యూగా ఫాలో అవుతారని .. హెల్దీ బ్రేక్ ఫాస్ట్ చేయడానికి ఇష్టపడతారు అని ఆయన చెప్పకువచ్చారు. అంతేకాదు ఉదయం ఇంటి నుండి షూటింగ్ కి బయలుదేరే టైంలోనే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తినేసి వస్తారని ..ఇక తర్వాత 11 గంటలకు పెరుగు వడ మాత్రమే తినేవారని.. టీ కాఫీలు అస్సలు ఇష్టపడేవారు కాదని ” చెప్పుకువచ్చారు.

“ఉదయాన్నే లేవగానే రెండు గ్లాసులు గోరువెచ్చని నీళ్లను తాగే వారని ..ఇప్పటికీ ఆయనకు ఈ అలవాటు ఉందని తెలుస్తుంది .అంతేకాదు మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనం తూ చా తప్పకుండా తినేవారిని..ఆ తరువాత కొంచెం సేపు పడూకుని.. సాయంత్రం 5 గంటలకు గోధుమ రవ్వతో వేసిన దోశను ఇష్టంగా తెప్పించుకొని తినేవారిని చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా మనీ హోటల్లో వేసిన గోధుమ రవ్వ దోశ అంటే సూపర్ స్టార్ కృష్ణకు చాలా ఇష్టమట”. ఇది చెన్నై స్టైల్ ఫుడ్ డైట్ .

అంతేకాదు ఎంత షూటింగ్లో బిజీగా ఉన్న సరే టైం టు టైం ఫుడ్డ్ తినేసేవారట. అంతేకాదు షూటింగ్స్ ఆపేసిన తర్వాత ఇంట్లో ఉంటున్న టైంలో కూడా ఇప్పటికి సూపర్ స్టార్ కృష్ణ ఇదే డైట్ ని ఫాలో అయ్యేవారట. తిన్న తర్వాత తన ప్లేట్ తీయడం ..తిన్న తర్వాత ఒక 20 మినిట్స్ వాక్ చేయడం ఇలాంటివి చేస్తుంటారంట . ఏది ఏమైనా సరే ఇన్ని హెల్త్ జాగ్రత్తలు తీసుకున్న లాస్ట్ మినిట్ లో అన్ని అవయవాలు పాడవడం చాలా దారుణం అంటున్నారు కృష్ణ ఫ్యాన్స్ . ఏది ఏమైనా సరే కృష్ణలేని లోటు మహేష్ బాబుకు ఎవరు తీర్చలేనిది

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news