Moviesబ‌న్నీతో ఆ హీరోయిన్ స్నేహం... ఏదో తేడా కొడుతోంది... ఎన్నో అనుమానాలు...!

బ‌న్నీతో ఆ హీరోయిన్ స్నేహం… ఏదో తేడా కొడుతోంది… ఎన్నో అనుమానాలు…!

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ అల్లు అర్జున్ వ‌రుస పెట్టి సూప‌ర్ హిట్లు కొడుతున్నారు. అల వైకుంఠ‌పురంలో బ్లాక్‌బ‌స్ట‌ర్‌.. ఇక పుష్ప పాన్ ఇండియా రేంజ్ హిట్‌. పుష్ప ఊహించ‌ని విధంగా బాలీవుడ్లో రు. 100 కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. దీంతో ఇప్పుడు పాన్ ఇండియా లెవ‌ల్లో పుష్ప 2 సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. పుష్ప‌లో బ‌న్నీ చెప్పిన ఆ స్లాగ్ డైలాగ్స్‌, యాక్ష‌న్‌.. ఊర‌మాస్ క్యారెక్ట‌ర్ సౌత్ టు నార్త్ ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేసింది.

ఈ సినిమా ఊహించ‌నంత పెద్ద హిట్ కావ‌డంతో స‌హ‌జంగానే ఇప్పుడు సీక్వెల్‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. అయితే పుష్ప‌లో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ కాగా కేథ‌రిన్ థెస్రాను కూడా మ‌రో కీల‌క రోల్ కోసం తీసుకున్నారు. ఈ సినిమాలో ఆమెది నెగ‌టివ్ రోల్ .. క‌థ‌ను కీల‌కంగా మలుపు తిప్పే పాత్ర ఇదే అంటున్నారు. ఇక ఈ సినిమాలో మ‌రో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర ఉండ‌గా.. దానిని బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు మ‌నోజ్ బాజ్‌పాయ్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో నెగ‌టివ్ లేడీ పాత్ర‌కు కేథ‌రిన్ థెస్రాను బ‌న్నీయే స్వ‌యంగా రిక‌మెండ్ చేశాడ‌న్న గుస‌గుస‌లు వ‌స్తున్నాయి. మామూలుగా చూస్తే కేథ‌రిన్ తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా ఆమె పెద్ద స‌క్సెస్ కాలేదు. క‌నీసం మీడియం రేంజ్ హీరోయిన్‌గా కూడా ఆమెకు ఛాన్సులు రాలేదు. అయితే ఒక్క బ‌న్నీ సినిమాల్లోనే ఇప్ప‌టికే మూడు సార్లు న‌టించ‌గా.. ఇప్పుడు నాలుగోసారి ఆమెకు ఛాన్స్ ఇచ్చారు.

కేథ‌రిన్ బ‌న్నీ న‌టించిన ఇద్ద‌ర‌మ్మాయిల‌తో – స‌రైనోడు – రుద్ర‌మ‌దేవి సినిమాల్లో న‌టించింది. అప్పుడే చాలా మంది మీడియం రేంజ్ హీరోలే ప‌ట్టించుకోని కేథ‌రిన్‌కు బ‌న్నీ వ‌రుస‌గా ఇన్నిసార్లు ఛాన్సులు ఇస్తున్నాడేంట‌బ్బా అన్న సందేహాలు వ‌చ్చిన‌ప్పుడే వీరి మ‌ధ్య చాలా క్లోజ్‌నెస్ ఉంద‌ని సందేహించారు. ఇక స‌రైనోడు వ‌చ్చి కూడా ఐదేళ్లు అయ్యింది.

ఇటీవ‌ల కాలంలో కేథ‌రిన్ న‌టించిన పేరున్న సినిమా ఒక్క బింబిసార మాత్ర‌మే. అస‌లు నాలుగైదేళ్లుగా టాలీవుడ్ కేథ‌రిన్‌ను మ‌ర్చిపోయింది. ఇక ఇప్పుడు పుష్ప 2 పాన్ ఇండియా లెవ‌ల్లో వ‌స్తోంది. బ‌న్నీ కూడా కావాల‌నే త‌న బెస్ట్ ఫ్రెండ్‌ను రిక‌మెండ్ చేయించి మ‌రీ ఆమెకు క్యారెక్ట‌ర్ ఇచ్చాడ‌నే అంటున్నారు. ఎంతో డీప్ స్నేహం ఉండ‌బ‌ట్టే బ‌న్నీ కేథ‌రిన్ కెరీర్‌ను జాగ్ర‌త్త‌గా కాపాడుతున్నాడ‌ని ఇన్న‌ర్ టాక్?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news