Moviesనిత్యా మీనన్‌ను చూసి లెస్బియన్ పాత్రకి రెడీ అయిన స్టార్ హీరోయిన్..!

నిత్యా మీనన్‌ను చూసి లెస్బియన్ పాత్రకి రెడీ అయిన స్టార్ హీరోయిన్..!

ఇండస్ట్రీలో ఒక హీరోయిన్‌ను చూసి మరో హీరోయిన్ చాలా విషయాలను ఫాలో అవుతూ ఉంటారు. ముఖ్యంగా కమర్షియల్ హీరోయిన్ అనిపించుకునేందుకు కొత్తగా వచ్చిన హీరోయిన్స్ అప్పటికే, స్టార్ హీరోయిన్స్‌గా వెలుగుతున్నవారిని ఫాలో అవడం మొదలుపెట్టేస్తారు. అంతేకాదు, చాలా పాత్రల విషయంలో కూడా ఇన్స్పిరేషన్ తీసుకుంటుంటారు. ఇక కొందరైతే స్టార్ డం కోసం ఓ హీరోయిన్ చేసిన ఛాలెంజింగ్ రోల్స్‌ను పట్టుపట్టి మరీ ఒప్పుకొని చేస్తుంటారు.

అయితే, అందరూ కమర్షియల్ హీరోయిన్స్ కమర్షియల్ హీరోయిన్‌గా సక్సెస్ కాలేరు. అందరూ ఫ్యామిలీ హీరోయిన్‌గా పాపులర్ కాలేరు. అందరూ లేడి ఓరియెంటెడ్ సినిమాలకి సూటవరు. అందుకే, మన మేకర్స్ ఓ జోనర్‌లో సినిమా అనుకుంటే ఆ సినిమా కథకి తగ్గ హీరోయిన్‌ను ఎంచుకునేందుకు చాలా కసరత్తులు చేస్తారు. ఇక కొందరు హీరోయిన్స్ మరో హీరోయిన్ చేసి సక్సెస్ సాధించిన పాత్ర మీద మక్కువతో కసితో అలాంటి సినిమా చేస్తారు.

అలా స్టార్ హీరోయిన్ సమంత కూడా ఇటీవల ఓ సినిమాను కమిటైందేమోనని చెప్పుకుంటున్నారు. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఒప్పుకుంటున్న సినిమాలు చాలా భిన్నంగా ఉంటున్నాయి. ఒక సినిమాకి మరో సినిమాకి అసలు సంబంధం లేకుండా కమిటవుతోంది. గుణశేఖర్ దర్శకత్వంలో చేస్తున్న శాకుంతలం ఓ జోనర్ సినిమా. యశోద మరో జోనర్ సినిమా. అలాగే, బాలీవుడ్‌లో చేస్తున్న వెబ్ సిరీస్ మరో రకం.

ఇవన్నీ ఒకెత్తైతే నిత్యా మీనన్ బాలీవుడ్‌లో చేసిన లెస్బియన్ పాత్ర ఇప్పుడు సమంత చేయడానికి రెడీ అవడం మరో ఎత్తు. నిత్యా మీనన్ ఒకే ఒక్క సీన్‌లో మరో అమ్మాయితో కలిసి రొమాన్స్ చేసింది. పెదవులు కలిపి డీప్ లిప్ లాక్‌తో వేడి పుట్టించింది. అయితే, సమంత హాలీవుడ్‌లో చేస్తున్న మొదటి సినిమా ది అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ అనే సినిమా పూర్తిగా లెస్బియన్ జానర్‌లో తెరకెక్కేది. ఓ రకంగా గతంలో ఇలాంటి సినిమాలు చేసి మెప్పించినవారిని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని సమంత హాలీవుడ్ మూవీని కమిటైందట. మరి ఈ పాత్రలో ఎంతవరకూ మెప్పిస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news