Moviesపెళ్లికి ముందే "జింతాక జిత జిత".. సుజాత రాకేష్‌ ఇంట్లోనే ఉంటోందా?

పెళ్లికి ముందే “జింతాక జిత జిత”.. సుజాత రాకేష్‌ ఇంట్లోనే ఉంటోందా?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలోనే కాదు .. బుల్లితెరపై కూడా చాలామంది జంటలు డేటింగ్ అంటూ పెళ్లికి ముందే కలిసి జీవిస్తున్నారు. కాగా రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అయినట్లు తెలుస్తుంది జబర్దస్త్ కామెడీయన్ రాకింగ్ రాకేష్ – బిగ్ బాస్ బ్యూటీ జోర్దార్ సుజాత . మనకు తెలిసిందే జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న రాకింగ్ రాకేష్.. తనదైన స్టైలంలో కామెడీ చేస్తూ అలరిస్తున్నాడు.

కాగా కొన్నాళ్ల క్రితం వరకు బాగానే ఉన్న రాకింగ్ రాకేష్ ..ఈ మధ్యకాలంలో ఎక్కువగా జోర్దార్ సుజాతతో స్కిట్స్ వేస్తూ ..సరదాగా కబుర్లు చెబుతూ ..భారీ భారీ లవ్ డైలాగ్స్ కొడుతూ పబ్లిక్ గానే భార్యాభర్తలా బిహేవ్ చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిపోయిన జనాలు.. ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ మిగతా జబర్దస్త్ కమెడియన్స్ ని అడుగుతున్నారు . ఈ క్రమంలోని రష్మి-సుధీర్, వర్ష-ఇమ్మానుయేల్ జోడి కి ఎంత క్రేజ్ వచ్చిందో.. అలాంటి ఓ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు సుజాత- రాకింగ్ రాకేష్.

ఈ క్రమంలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుందని ఓ న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు రీసెంట్గా మిస్టర్ అండ్ మిసెస్ షోలో కూడా ఇద్దరు కపుల్ గా ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఈ న్యూస్ అఫీషియల్ అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు . కాగా రీసెంట్గా జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి కారు కొన్నాడు , ఈ సందర్భంగా అతడు రాకింగ్ రాకేష్ కు సర్ ప్రైజ్ ఇవ్వడానికి.. ఇంటికి వెళ్లి మరీ కార్ చూపించాడు.

ఇదే విషయాన్ని రాకింగ్ రాకేష్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఒక క్రేజీ సెల్ఫీ ని దిగారు. ఈ సెల్ఫీలో రాకింగ్ రాకేష్ రచ్చ రవితో పాటు సుజాత కూడా ఉంది. దీంతో పెళ్లికి ముందే ఈ జంట కలిసి జీవిస్తున్నారా అంటూ న్యూస్ వైరల్ గా మారింది .పెళ్లి కాకముందే కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారని న్యూస్ లో వైరల్ గా మారింది. ఏది ఏమైనా సరే జోర్దార్ సుజాత రాకింగ్ రాకేష్ పేర్లు ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Rocking Rakesh (@jabardasthrakesh)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news