Moviesబిగ్ బాస్ చరిత్రలోనే మరో సంచలనం..అతడు నన్ను అక్కడ ముద్దు పెట్టుకున్నాడు.....

బిగ్ బాస్ చరిత్రలోనే మరో సంచలనం..అతడు నన్ను అక్కడ ముద్దు పెట్టుకున్నాడు.. ఓపెన్ గా చెప్పేసిన గీతూ..!?

తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అతి పెద్ద రియాలిటీ షోగా పాపులారిటీ దక్కించుకున్న బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రియాలిటీ షో అంటూ ఈ షోలో చేసే పనుల గురించి షో చూస్తున్న జనాలకి కొత్తగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా 5 సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ తెలుగులో ప్రజెంట్ ఆరో సీజన్ కొనసాగుతుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా బిగ్ బాస్ టిఆర్పి రేటింగ్ దారుణాతి దారుణంగా పడిపోయింది. దానికి కారణం వీక్ కంటెస్టెంట్స్.. చెప్పుకోతగా టాస్క్ లు లేకపోవడం అనే మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.

కాగా బిగ్ బాస్ టిఆర్పి రేటింగ్ ఎలాగైనా సరే పుంజుకునేలా చేయడానికి బిగ్ బాస్ మేనేజ్మెంట్ , హోస్ట్ నాగార్జున తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు. కానీ వాళ్ళ దరిద్రమో లేదా కర్మ అనేది తెలియదు కానీ బిగ్ బాస్ టిఆర్పి రేటింగ్ మాత్రం రోజు రోజుకి మరింత స్థాయిలో దిగజారిపోతుంది. ఇదే కనుక కంటిన్యూ అయితే బిగ్ బాస్ సీజన్ 7 ఇక రాదు అంటున్నారు విశ్లేషకులు. ఇక్కడితో బిగ్ బాస్ చరిత్రకు ముగింపు పలికినట్టే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఇది బిగ్ బాస్ చరిత్రలోనే మరో సంచలనం అని చెప్పాలి.

కాగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం చాలా రేర్.. అలాగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ బిగ్ బాస్ కంటెస్టెంట్ గీతూ అందరిని ఆకర్షిస్తుంది . మనకు తెలిసిందే మొదటి వారం నుంచి హౌస్ లో గొడవలకు కారణం అంటూ గలాట గీతూ పై కొందరు కంటెస్టెంట్స్ గోల చేస్తున్నారు . అయితే నాగార్జున ఇచ్చిన వార్నింగ్ ప్రభావమో లేక హౌస్ లో ఉండాలని డిసైడ్ అయిందో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో గలాటా గీతూ గొడవలకు దూరంగా ఉంటుంది. హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది . రీసెంట్ గా ఆమె ఓ ఇష్యూ గురించి మాట్లాడుతూ రేవంత్ ముద్దు పెట్టుకున్నాడు అని చెప్పి షాక్ ఇచ్చింది.

ఆశ్చర్యం ఏంటంటే ఈ విషయం గీతూ నే రేవంత్ కి చెప్పింది. రేవంత్ గీతూ మాట్లాడుకుంటూ మాటలు మధ్యలో గీత రేవంత్ కి ఓ సలహా ఇచ్చింది . “నువ్వు పక్కవాళ్లు ఏమనుకుంటారో ఆలోచించి బిహేవ్ చెయ్.. నీ మనసులో తప్పుడు ఉద్దేశం లేకపోయినా.. బయట చూసే జనాలకు అదే అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్నావు అది నాకు తప్పుగా లేదు కానీ బయట చూసేవాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. రేవంత్ ఇలాంటి వాడా అనుకుంటారు ..అదేవిధంగా ఫైమా కాళ్ల పై పడుకున్నావ్ అది ఆమెకి ఇబ్బందిగా ఉంటుందా..? లేదా..? అని నువ్వు ఆలోచించుకోవాలి. ఆమెకేం ప్రాబ్లం లేకపోతే నువ్వు పడుకోవచ్చు . ఒకసారి ఆలోచించుకో రేవంత్” అంటూ అందరి ముందు చెప్పింది. అయితే రేవంత్ కూడా “ఎస్ ఓకే అది నా తప్పు.. ఇకనుంచి నేను తెలుసుకొని బిహేవ్ చేస్తాను “అంటూ మ్యాటర్ ని కూల్ చేసాడు. దీంతో గీతు-రేవంత్ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news