Moviesఆర్తీ అగర్వాల్ ఆ నిర్మాత ఒక్కడి వద్దే రెండేళ్లకి పైగా ఉందా..?

ఆర్తీ అగర్వాల్ ఆ నిర్మాత ఒక్కడి వద్దే రెండేళ్లకి పైగా ఉందా..?

దివంగ‌త అందాల తార ఆర్తీ అగ‌ర్వాల్ 20 ఏళ్ల క్రింద‌ట తెలుగు సినిమాను త‌న అంద చందాల‌తో ఓ ఊపు ఊపేసింది. వెంక‌టేష్ హీరోగా కె. విజ‌య్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన నువ్వునాకు న‌చ్చావ్ సినిమాతో ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఫొటో చూసిన ద‌ర్శ‌కుడు విజ‌య్‌, సురేష్‌బాబు అమెరికా నుంచి ఆమెను ర‌ప్పించి మ‌రీ టెస్ట్ షూట్ చేసి హీరోయిన్‌గా ఎంపిక చేశారు. తొలి సినిమాయే పెద్ద హీరో, పెద్ద బ్యాన‌ర్ సూప‌ర్ హిట్‌.

ఆ సినిమా విజ‌యంలో ఆర్తీ పాత్ర చాలానే ఉంది. ఆ త‌ర్వాత సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌లోనే త‌రుణ్ హీరోగా నువ్వులేక నేనులేను సినిమా. ఈ రెండు సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో అస్స‌లు ఆర్తీ మూడేళ్ల పాటు తెలుగులో వెన‌క్కు తిరిగి చూసుకోలేదు. వ‌రుస‌గా చిరంజీవితో ఇంద్ర‌, బాల‌య్య‌తో ప‌ల‌నాటి బ్ర‌హ్మ‌నాయుడు, ఉద‌య్‌కిర‌ణ్‌తో నీ స్నేహం, ఎన్టీఆర్‌తో అల్ల‌రి రాముడు, ప్ర‌భాస్‌తో అడ‌వి రాముడు, నాగార్జున‌తో నేనున్నాను ఇలా చెప్పుకుంటూ పోతే స్టార్ హీరోల‌తో మొద‌లు పెట్టి కుర్ర హీరోల వ‌ర‌కు అంద‌రితోనూ వ‌రుస‌గా సినిమాలు చేసి హిట్లు కొట్టింది.

ఆ రోజుల్లో ఆర్తీ ఉందంటే చాలు సినిమా స‌గం స‌క్సెస్‌. బిజినెస్ కూడా ఆమె ఉంటే ఎక్కువుగా జ‌రిగేది. అంత స్తాయి ద‌క్కించుకున్న ఆమె త‌రుణ్‌తో ప్రేమ వ్య‌వ‌హారం న‌డ‌ప‌డంతో కెరీర్ ప‌రంగా దెబ్బ‌తింద‌నే అంటూ ఉంటారు. మూడేళ్ల త‌ర్వాత ఆమె ఫేడ‌వుట్ అయిపోయింది. ఆర్తీ శ‌రీరాకృతితో కూడా భారీగా మార్పులు రావ‌డంతో ఆమెను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. ఇదంతా ఆమె చేజేతులా చేసుకుందే.

అయితే మ‌రికొంత కాలం ఇక్క‌డ ఛాన్సులు వ‌చ్చేవే అని… ఓ అగ్ర నిర్మాత ఆర్తీని ఛాన్సులు ఇప్పిస్తానంటూ మాయ మాట‌లు చెప్పి రెండేళ్ల పాటు త‌న గుప్పెట్లోనే పెట్టుకున్నార‌న్న పుకార్లు అయితే అప్ప‌ట్లో వ‌చ్చాయి. ఆమె యేడాది పాటు స‌ద‌రు నిర్మాత గెస్ట్ హౌస్‌లోనే ఉండేద‌ట‌. ఆయ‌న వ‌ల్లే త‌నకు కెరీర్ స్టార్టింగ్‌లో మంచి ఛాన్సులు వ‌చ్చి.. హిట్లు ప‌డ‌డంతో ఆర్తీ కూడా ఏమీ అన‌లేని ప‌రిస్థితి.

ఆమెకు ఇండ‌స్ట్రీలో ఎవ్వ‌రూ గాడ్ ఫాద‌ర్లు లేక‌పోవ‌డంతో ఆ నిర్మాత‌ను నిండా న‌మ్మేసింది. అయితే స‌ద‌రు నిర్మాత మాత్రం ఆర్తిని అన్ని విధాలా వాడుకున్నార‌నే టాకే ఇండ‌స్ట్రీలో ఉంది. ఇది కూడా ఆమె కెరీర్ దెబ్బ‌తిన‌డానికి ప్ర‌ధాన కార‌ణాల్లో ఒక్క‌టిగా నిలిచింద‌ని అంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news