Moviesపెళ్లికి ముందు ఎఫైర్స్ పై స్పందించిన సీరియల్ నటి... భర్త కు...

పెళ్లికి ముందు ఎఫైర్స్ పై స్పందించిన సీరియల్ నటి… భర్త కు ముందే చెప్పేశా అంటూ ఓపెన్..!

తెలుగు సీరియల్స్ నటీమణులు కూడా హీరోయిన్స్ రేంజ్ లో అభిమానులు ఉంటారు. నిజానికి సినిమాలు ఎక్కువగా యూత్ చూస్తుంటారు.. కానీ సీరియల్స్ కుటుంబం మొత్తం కలిసి చూస్తారు. ఇక సినిమా హీరోయిన్ ల మాదిరిగానే సీరియల్ హీరోయిన్ ల మీద కూడా రూమర్ లు వస్తూ ఉంటాయి. అలాంటి రూమర్స్ సీరియల్ నటి మరియు యాంకర్ సమీరాపై కూడా వచ్చాయి. పలు సీరియల్స్ లో నటించి సమీరా ఎంతమంది అభిమానులను సంపాదించుకుంది.

 

అంతే కాకుండా యాంకర్ గా కూడా సమీరా ఆకట్టుకుంది. సమీరా అదిరింది అనే కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించింది. ఇదిలా ఉంటే అప్పట్లో సమీరా ఓ సీరియల్ హీరోతో లవ్ ఎఫైర్ నడిపించింది అంటూ వార్తలు వినిపించాయి. కాగా చివరికి సమీరా అన్వర్ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. అన్వర్ కూడా మరెవరో కాదు. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉన్న సీనియ‌ర్ న‌టి సన కుమారుడు.

ఇక సమీరా అప్పట్లో ఓ ప్రముఖ సీరియల్ నటుడితో రిలేషన్ షిప్ లో ఉంది అంటూ వార్తలు వినిపించాయి. అత‌డు ఓ సీనియ‌ర్ న‌టుడు. అత‌డికి అప్ప‌టికే పెళ్ల‌య్యి పిల్ల‌లు కూడా ఉన్నారు.
కాగా ఆ వార్తలపై ఓ ఇంటర్వ్యూలో తన భర్తతో కలిసి షాకింగ్ కామెంట్స్ చేసింది. సమీరా మాట్లాడుతూ… నేనేంటో నా వ్యక్తిత్వం ఎలాంటిదో మా ఇంట్లో వాళ్లకి తెలుసు. నేను సొంత అక్కగా భావించిన వాళ్ళు… నేను ఎంతో నమ్మిన వాళ్ళే ఈ పుకార్లను క్రియేట్ చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

తాను షూటింగ్ లో ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోను అని చెప్పింది. షూటింగ్ నుండి వచ్చిన తర్వాత ఎవరితో కూడా ఫోన్ లో మాట్లాడని చెప్పింది. ఇండస్ట్రీ లో ఉన్నవాళ్లంతా మనకు పోటీనే.. మన ముందు మంచిగా మాట్లాడుతూ వెనక గోతులు తవ్వుతారు అంటూ వ్యాఖ్యానించింది. ఇక సమీరా భర్త అన్వర్ మాట్లాడుతూ….వైవాహిక జీవితంలో ఉండాల్సింది నమ్మకం అని అన్నారు. సమీరా తన గత రిలేషన్ షిప్ ల గురించి తనకు చెప్పిందని…..తన రిలేషన్ షిప్ ల గురించి సమీరాకు చెప్పానని అన్నారు. ఇద్దరి మధ్య ముందుగా నమ్మకం ఉండాలని చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news