Moviesఇంట్రెస్టింగ్: కృష్ణంరాజు ఫ్యామిలీకి సంబంధించి ఎవరికీ తెలియని "ప" సెంటిమెంట్‌ విషయాలు...

ఇంట్రెస్టింగ్: కృష్ణంరాజు ఫ్యామిలీకి సంబంధించి ఎవరికీ తెలియని “ప” సెంటిమెంట్‌ విషయాలు .. !!

టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు నేడు తెల్లవారుజామున తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ విషాద వార్తతో సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. రెబెల్ అభిమానులు అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా ప్రభాస్ ని ఆపడం ఎవరి తరం కావడం లేదు . తన సినీ కెరీర్ కు పునాది వేసిన తన లైఫ్ కు పెద్ద దిక్కుగా నిలిచిన పెదనాన్న గారు చనిపోవడంతో ప్రభాస్ చాలా బాధపడుతున్నారు. కాగా కృష్ణంరాజుకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే ఆయనకు “ప” అనే పదం ఎంత సెంటిమెంటో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..!!

కృష్ణంరాజు తన సినీ కెరియర్ లో మొత్తంగా దాదాపు 200 సినిమాలకు పైగా నటించినట్లు సమాచారం. కేవలం సినిమాలోనే కాదు రాజకీయంలోనూ తనదైన స్టైల్ లో రాణించారు కేంద్ర మంత్రిగా కూడా వర్క్ చేశారు. కాగా ఇంతటి స్టార్ స్టేటస్ కలిగిన వ్యక్తికి “ప” అనే అక్షరం చాలా సెంటిమెంట్.. ఇష్టమట. అందుకే తన బిడ్డల అందరికీ “ప” అనే అక్షరం కలిసి వచ్చేలా పేరు పెట్టాడు . కృష్ణంరాజు రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. మొదట భార్య సీతాదేవి ఒక కార్ యాక్సిడెంట్ లో మరణించారు. ఆ టైంలో కుటుంబ పెద్దలు అందరూ కృష్ణంరాజును రెండో పెళ్లి చేసుకోమని బలవంతం చేసి శ్యామలాదేవి ని ఇచ్చి పెళ్లి చేశారు.

 

కాగా 1996 సెప్టెంబర్ 20న శ్యామల దేవితో రెండో వివాహం చేసుకున్నారు కృష్ణంరాజు. వీరికి ముగ్గురు సంతానం ఆ తర్వాత అమ్మాయిని కూడా దత్తత తీసుకున్నారు . అమ్మాయిలు అంటే కుంపటి అని చూసే ఈ రోజుల్లో కృష్ణంరాజు ముగ్గురు ఆడపిల్లలు ఉన్న మరో ఆడబిడ్డను దత్తత తీసుకోవడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. కాగా కృష్ణంరాజు పెద్ద కూతురు పేరు సాయి ప్రసీద ,రెండో కూతురు పేరు సాయి ప్రకీర్తి ,మూడోకూతురు పేరు సాయి ప్రదీప్తి . అంతేకాదు దత్తత తీసుకున్న మరో కూతురు పేరు ప్రశాంతి ఇలా అందరి పేర్లలో “ప” అనే అక్షరం కలిసి వచ్చేలా పెట్టాడు కృష్ణంరాజు. అంతే కాదు తన కొడుకులైనా ఇద్దరికీ ప్రభాస్ , ప్రమోద్ అనే పేర్లు పెట్టాడు. కృష్ణంరాజు ఈ లోకంలో లేరు అనే వార్త అభిమానులకు పెద్ద షాకింగ్ గా ఉంది. ఆ విషయాన్ని ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news