Moviesనిత్యామీన‌న్ లెస్బియ‌న్ రోల్ చూసి స‌మంత షాకింగ్ డెసిష‌న్‌... వామ్మో ఇంత...

నిత్యామీన‌న్ లెస్బియ‌న్ రోల్ చూసి స‌మంత షాకింగ్ డెసిష‌న్‌… వామ్మో ఇంత ర‌చ్చ‌నా…!

ఒకరు చేసిన పాత్రను మరొకరు ఛాలెంజింగ్‌గా తీసుకొని చేసి చూపించడమే కాదు బాక్సాఫీస్ వద్ద తమ రేంజ్ ఏంటో చూపించడానికి తాపత్రయపడుతుంటారు. ముఖ్యంగా హీరోల మధ్య ఈ పోటీ తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నడుస్తుంది పాన్ ఇండియా సినిమా ట్రెండ్. దాదాపు మన సౌత్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలను ట్రై చేస్తున్నారు. అందరికీ ఆ క్రేజ్ మాత్రం దక్కడం లేదు. ప్రభాస్ బాహుబలి సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా క్రేజ్ తెచ్చుకున్నారు.

ఆ తర్వాత అదే పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది కన్నడ హీరో యష్‌కి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించిన కేజీఎఫ్ 1 మూవీతో యష్.. ప్రభాస్ మాదిరిగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత కేజీఎఫ్ 2తో ఆ రేంజ్ మరో రేంజ్‌కి వెళ్ళింది. అలాగే అల్లు అర్జున్, రాం చరణ్, ఎన్.టి.ఆర్ కూడా. అయితే, హీరోయిన్స్ కూడా గత కొన్నేళ్ళుగా ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి ఎంత మాత్రం ఆలోచించడం లేదు. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి లాంటి బయోపిక్ సినిమాలో నటించడమే కాదు..బోల్డ్ పాత్రలను చేయడానికి కూడా రెడీగా ఉన్నారు.

ముఖ్యంగా నిత్యా మీనన్ లాంటి వారు మహానటి వంటి సినిమాలను కూడా వదులుకున్నా పాత్ర డిమాండ్ చేస్తే లెస్బియన్ పాత్ర చేయడానికి సై అంటున్నారు. ఇప్పటికే, అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ వెబ్ సిరీస్‌లో నిత్యా తోటి నటితో పెదవి ముద్దుపెట్టుకొని షాకిచ్చింది. అసలు సినిమాలలో హీరోకే లిప్ కిస్ ఇవ్వని నిత్యా ఇలా మరో అమ్మాయితో రొమాన్స్ అంటే ఆశ్చర్యమే.

అయినా ఆ పాత్రతో బాగానే మెప్పించింది. ఇది చూసే స్టార్ హీరోయిన్ సమంత కూడా ఓ హాలీవుడ్ మూవీని ఒప్పుకుందని చెప్పుకుంటున్నారు. నిత్యానే చేసినప్పుడు నాకేం తక్కువనే భావనతో సమంత లెస్బియన్ పాత్రను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇప్పటికే, ఈ సినిమా అఫీషియల్‌గా ప్రకటించారు. మరి ఈ పాత్రలో సమంత ఎలా ? మెప్పిస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news