Moviesఫ్లాప్ సినిమా హీరో కి గెస్ట్ గా మరో ఫ్లాప్ హీరో..ఆడేసుకుంటున్న...

ఫ్లాప్ సినిమా హీరో కి గెస్ట్ గా మరో ఫ్లాప్ హీరో..ఆడేసుకుంటున్న నెటిజన్లు..!!

వామ్మో..సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఈ మీమ్‌స్ ఎక్కువైపోయాయి. స్టార్స్ పై ట్రోలింగ్ కూడా ఎక్కువైపోయింది. మరీ ముఖ్యంగా సినీ రంగలో ఈ ట్రోలింగ్ బాధలు ఎక్కువైపోతున్నాయి. ఏ మాట మాట్లాడినా ..క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో మరీ ముఖ్యంగా నేచురల్ స్టార్ హీరో నాని ఎక్కువ టార్గెట్ చేశారు జనాలు. వరుస సినిమాలు ఫ్లాప్ అవ్వడం వల్ల కావచ్చు. లేక మరేదైన రీజన్ కావచ్చు..ఆయన పై ట్రోలింగ్ ఎక్కువుగా జరుగుతుంది.

ఈ క్రమంలోనే మరొసారి ట్రోలర్స్ నాని ని టార్గెట్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పైకి ఎదిగిన వాళ్ళ పేర్లు చెప్పమంటే చిరంజీవి తర్వాత ఎవరైనా సరే రవితేజ, నాని పేర్లే చెప్తారు. కానీ, ఈ మధ్య కాలంలో నాని చేసిన కొన్ని కామెంట్ల కారణంగా ఓ వర్గం ఆయన్ని బాగా టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే ఆయన సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు డప్పు కొట్టి మరి సినిమా నెగిటివ్ టాక్ ను పబ్లిసిటీ చేస్తుంది. కాగా, తాజాగా రవితేజ హీరోగా రాబోతున్న సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రాబోతున్నరు నాని.

‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ దుమ్ము దులిపేస్తుంది. మరోసారి మాస్ క్యారెక్టర్ లో రవితేజ మెరిపించనున్నాడు అంటూ ట్రైలర్ ని చూస్తుంటేనే అర్ధమైపోతుంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడ్డ ఈ సినిమా కోసం రవితేజ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్ టైందగ్గర పడుతుండటంతో ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 24 ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ లో చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి న్యాచురల్ స్టార్ నాని గెస్ట్ గా రాబోతున్నాడు. నిజానికి ఇద్దరు హీరో ఏ సపోర్ట్ లేకుండా ఇందస్ట్రీకి వచ్చి ఇలాంటి పొజీషన్ కి వచ్చారంటేనే గ్రేట్. ఖచ్చితంగా మెచ్చుకోవాలి. కానీ, నాని ను టార్గెట్ చేస్తున్న ఓ వర్గం మాత్రం దీని పై నెగిటివ్ పబ్లిసిటీ చేస్తుంది. ఫ్లాప్ సినిమా హీరో కి గెస్ట్ గా మరో ఫ్లాప్ హీరో అంటూ ట్రోల్ చేస్తున్నారు. కానీ, అభిమానులు మాత్రం ఇవేమి లెక్క చేయడం లేదు. నాని రవితేజ కోసం వస్తుండటంతో ఈ ఈవెంట్ కోసం, వాళ్ళిద్దర్నీ ఒకే స్టేజిపైన చూడటం కోసం అభిమానులు, సినీ ప్రేముఖులు ఎదురు చూస్తున్నారు. ఈ ఈవెంట్ లో ఎన్ని మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయో మరి కొద్ది సేప్పట్లోనే తెలిసిపోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news