Moviesజయలలిత కాకుండా ఎంజీఆర్ ఇంతమంది హీరోయిన్ల‌తో ప్రేమాయణం నడిపించారా..?

జయలలిత కాకుండా ఎంజీఆర్ ఇంతమంది హీరోయిన్ల‌తో ప్రేమాయణం నడిపించారా..?

ఒకప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో హీరో ఎంజీఆర్ తిరుగులేని స్టార్ గా ఎదిగారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి అభిమానులను సంపాదించుకున్నారు. అంతేకాకుండా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్టించారు. ఇక ఎంజిఆర్ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పటికీ హీరోయిన్ లతో ఎఫైర్స్ మాత్రం మాయని మచ్చలా మిగిలిపోయాయి. ఎంజీఆర్ హీరోయిన్ జయలలితతో నడిపిన ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే.

జయలలిత చిన్న వయసులో ఉండగానే ఎంజీఆర్ తో ప్రేమలో పడ్డారు. 25 ఏళ్ల వయసులో జయలలిత తల్లి మరణించగా ఎంజీఆర్ ఆమెకు దగ్గరయ్యారు. కానీ తన రాజకీయ ఎదుగుదలకు జయలలితతో ఉన్న రిలేషన్షిప్ అడ్డు వస్తుందన్న కారణంతో ఆమెను పూర్తిగా పక్కన పెట్టారు. కానీ ఆ తర్వాత జయలలితే పార్టీలో చేరి పార్టీని నడిపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే చాలామంది ఎంజీఆర్ జయలలితని వాడుకుని వదిలేసారని కూడా ఆరోపిస్తూ ఉంటారు.

మరోవైపు ఎంజీఆర్ కేవలం జయలలితతో మాత్రమే కాకుండా మరి కొంతమంది హీరోయిన్లతో కూడా ప్రేమాయణాలు నడిపించారు. అలా ఎంజీఆర్ తో ప్రేమలో మునిగి తేలిన హీరోయిన్లలో ఒకప్పటి నటి నిర్మల కూడా ఉన్నారు. నిర్మల వెన్నిరాడై అనే తమిళ సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తర్వాతే ఎంజీఆర్ నిర్మలకు దగ్గరయ్యారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొంతకాలం రిలేషన్ షిప్ లో ఉన్నారు. కానీ మోజు తీరాక నిర్మలను కూడా ఎంజీఆర్ పక్కన పెట్టేశారు.

దాంతో మగవాళ్ళపై ద్వేషం పెంచుకున్న నిర్మల పెళ్లికి దూరంగా ఉన్నారు. నిర్మల తెలుగులో భక్త ప్రహ్లాద సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. అంతేకాకుండా శంకర్ దాదా ఎంబీబీఎస్ తో పాటు టాలీవుడ్ లో చాలా సినిమాల్లో హీరోలకు తల్లిగా నటించి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా తెలుగు హీరోయిన్ సంగీత కూడా ఎంజీఆర్ ప్రేమలో పడి మోసపోయారని చెబుతుంటారు.

ఆంధ్ర రాష్ట్రానికి చెందిన సంగీత ముత్యాలముగ్గు సినిమాతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆ తర్వాత తమిళ సినిమాల్లోనూ నటించారు. ఇక ఈ హీరోయిన్ కూడా ఎంజీఆర్ మాయలో పడిపోయారు. అంతే కాకుండా ఎంజీఆర్ తో ప్రేమాయణం…ఆ తరవాత మోసపోవడం వల్లే పెళ్లికి దూరం అయ్యారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news