Moviesషాకింగ్‌.. హీరోయిన్ మీనా భ‌ర్త మృతికి పావురాలే కార‌ణ‌మా..!

షాకింగ్‌.. హీరోయిన్ మీనా భ‌ర్త మృతికి పావురాలే కార‌ణ‌మా..!

సీనియ‌ర్ హీరోయిన్ మీనా భ‌ర్త విద్యాసాగ‌ర్ ( 48 ) గ‌త అర్ధ‌రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్ప‌ట‌ల్లో మృతిచెందిన సంగ‌తి తెలిసిందే. పోస్ట్ కోవిడ్ స‌మ‌స్య‌ల కార‌ణంగానే ఆయ‌న మృతి చెందిన‌ట్టు ప్రాథ‌మికంగా నిర్దారించారు. బెంగ‌ళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ అయిన విద్యాసాగ‌ర్‌ను మీనా 2009లో పెళ్లి చేసుకుంది. ఈ దంప‌తుల‌కు నైనిక అనే పాప కూడా ఉంది. ఈ నైనిక విజ‌య్ తెరీ సినిమాలో విజ‌య్ కూతురుగా కూడా న‌టించింది.

అయితే విద్యాసాగ‌ర్‌తో పాటు మీనా కుటుంబం అంతా గ‌త జ‌న‌వ‌రిలో కోవిడ్ భారీన ప‌డింది. త‌ర్వాత కోలుకున్నారు. అయితే అప్ప‌టి నుంచి ఆయ‌న‌కు ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది ప‌డుతూ వ‌స్తున్నారు. అందుకే త‌ర‌చూ చికిత్స చేయించుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే గ‌త రాత్రి కూడా ఆయ‌న‌కు తీవ్ర‌మైన శ్వాస‌కోస స‌మ‌స్య రాగా చెన్నైలో ఓ ప్రైవేట్ హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించారు. అక్క‌డ వైద్యులు ఎంత ప్ర‌య‌త్నించినా ఆయ‌న్ను కాపాడ‌లేక‌పోయారు.

అయితే త‌మిళ మీడియాలో విద్యాసాగ‌ర్ మృతికి ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నాలు వ‌స్తున్నాయి. పావురాల వ‌ల్లే విద్యాసాగ‌ర్ చ‌నిపోయాడ‌ని చెపుతున్నారు. మీనా ఇంటి ద‌గ్గ‌ర్లో కొన్ని వేల పావురాలు నివాసం ఉంటున్నాయ‌ట‌. వాటి వ్య‌ర్థాలు క‌లిసిన గాలి పీలుస్తుండ‌డంతో ఇంట్లో అంద‌రికి లంగ్ ఇన్‌ఫెక్ష‌న్ సోకిందంటున్నారు. దీనికి తోడు కోవిడ్ త‌ర్వాత ఈ స‌మస్య‌లు మ‌రింత ఎక్కువ‌య్యాయ‌ట‌.

విద్యాసాగ‌ర్ ఊపిరితిత్తులు మార్చాల‌ని డాక్ట‌ర్లు ట్రై చేసినా ఆర్గాన్ డోన‌ర్లు దొర‌క్క‌పోవ‌డంతో ఆయ‌న ప్రాణాలు కోల్పోవాల్సి వ‌చ్చిందంటున్నారు. ఇక విద్యాసాగ‌ర్ అంత్య‌క్రియ‌లు బుధ‌వారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు చెన్నైలోని బీసెంట్‌న‌గ‌ర్ శ్మ‌శాన వాటిక‌లో జ‌ర‌గ‌నున్నాయి. ఇక విద్యాసాగ‌ర్ మృతి ప‌ట్ల కోలీవుడ్ ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు త‌మ ప్ర‌గాడ సంతాపం తెలుపుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news