Moviesద‌ళ‌ప‌తి విజ‌య్ 66వ సినిమాకు నాగార్జున బ్లాక్‌బ‌స్ట‌ర్ టైటిల్‌...!

ద‌ళ‌ప‌తి విజ‌య్ 66వ సినిమాకు నాగార్జున బ్లాక్‌బ‌స్ట‌ర్ టైటిల్‌…!

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ 66వ సినిమా తెర‌కెక్కుతోంది. విజ‌య్ తొలిసారిగా తెలుగులో డైరెక్టుగా న‌టిస్తోన్న సినిమా ఇదే. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రాజు నిర్మిస్తోన్న ఈ బైలింగ్వుల్‌, పాన్ ఇండియా సినిమాలో క‌న్న‌డ స్టార్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్గా న‌టిస్తోంది.

ఈ సినిమాలో త‌మిళ‌, తెలుగు ఆర్టిస్టులు చాలా మందే న‌టిస్తున్నారు. దిల్ రాజు బ్యాన‌ర్లో క్రేజీ ప్రాజెక్టుగా వ‌స్తోన్న ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమా టైటిల్ విష‌యంలో ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. గ‌తంలో నాగార్జున న‌టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ టైటిల్‌నే ఇప్పుడు ఈ సినిమాకు ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

గ‌తంలో కింగ్ నాగార్జున హీరోగా వారసుడు సినిమా వ‌చ్చింది. ఈ సినిమాలో సూప‌ర్‌స్టార్ కృష్ణ కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపించారు. ఈ వార‌సుడు అప్ప‌ట్లో మ్యూజిక్‌ల్‌గా బిగ్గెస్ట్ హిట్ అవ్వ‌డంతో పాటు క‌మ‌ర్షియ‌ల్‌గా బిగ్ హిట్ అయ్యింది. ఇక విజ‌య్ గ‌త కొంత కాలంగా త‌న సినిమాల‌ను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నా.. ఎందుకోగాని ఇక్క‌డ స‌రైన మార్కెట్ ఏర్ప‌డ‌లేదు.

త‌మిళంలో విజ‌య్ క్రేజ్‌తో పోలిస్తే చిన్న హీరోలు విశాల్‌, కార్తీ, సూర్య‌, విజ‌య్ ఆంటోనీ ఇలా చాలా మంది కి తెలుగులోనూ చెప్పుకోద‌గ్గ మార్కెట్ ఉన్నా వీళ్లంద‌రితో పోలిస్తే విజ‌య్‌కు చాలా స్వ‌ల్ప మార్కెట్ మాత్ర‌మే ఉంది. అందుకే విజ‌య్ డైరెక్ట్ తెలుగు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. పైగా ఈ సినిమా నిర్మాత టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు కావ‌డంతో సినిమాపై సౌత్ ఇండియా వైజ్‌గానే భారీ అంచ‌నాలు ఉన్నాయి.

మ‌రి ఈ క్రేజీ ప్రాజెక్టుకు నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ టైటిల్‌ను ఫిక్స్ చేసుకోవ‌డం మ‌రింత ప్ల‌స్ కానుంది. ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ అయిన‌ప్ప‌టి నుంచే విజ‌య్ తెలుగు వెర్ష‌న్ ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొంటాడ‌ట‌. వంశీ పైడిప‌ల్లి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ ప్రాజెక్ట్‌ను టేకోవ‌ర్ చేశాడు. మ‌రి వంశీ పైడిప‌ల్లి ఈ సినిమాతో హిట్ కొడితే పాన్ ఇండియా రేంజ్‌లో ఖ‌చ్చితంగా తిరుగులేని డైరెక్ట‌ర్ అయిపోతాడ‌న‌డంలో సందేహం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news