Moviesఆర్తీ అగ‌ర్వాల్ త‌ల‌రాత మార్చేసిన త్రివిక్ర‌మ్ గీసిన గీత‌... వెన‌క ఇంత...

ఆర్తీ అగ‌ర్వాల్ త‌ల‌రాత మార్చేసిన త్రివిక్ర‌మ్ గీసిన గీత‌… వెన‌క ఇంత క‌థ న‌డిచిందా…!

సాధారణంగా ఒక సినిమా స్క్రిప్ట్ కేవలం దర్శకుడు, నిర్మాత, హీరో, మహా అయితే హీరోయిన్ వీళ్లు మాత్రమే వింటారు. వీళ్ళు తప్ప ఆ సినిమా స్క్రిప్ట్ వేరే ఎవరికి అవకాశమే ఉండదు. చివరికి డబ్బులు పెట్టి కొనే డిస్ట్రిబ్యూటర్ సైతం సినిమా చూసి కొనే రోజులు లేవు. అలాంటిది ఒక సినిమాను ప్రొడ్యూసర్ నుంచి ఆఫీస్ బాయ్ వరకు అందరు విని ఓకే చేయడం అంటే అది కత్తి మీద సాము లాంటిది. కానీ మనం ఇప్పుడు చెప్పబోయే సంఘటన ఒక అద్భుతమనే చెప్పాలి ఒక సినిమా స్క్రిప్ట్ ఓకే చేయాలంటే ప్రొడ్యూసర్ నుంచి ఆఫీస్ వరకు ప్రతి ఒక్కరు విన్నారంటే అది నిజంగా ఆశ్చర్యమే.

 

వివరాల్లోకి వెళ్తే, అది ఒక ఇల్లు. ఎంతో సందడి సందడిగా ఉంది. ప్రొడ్యూసర్ నుంచి డైరెక్టర్ అలాగే సంగీత దర్శకుడు, ఆఫీస్ బాయ్ వరకు ప్రతి ఒక్కరూ ఆ హాల్లో కూర్చుని మాట్లాడుతున్నారు. అందరు ఉండగా మాటల రచయిత అయిన త్రివిక్రమ్ లేచి స్క్రిప్ట్ చెప్పడం మొదలుపెట్టాడు.అందరూ అదేపనిగా వింటున్నారు కొందరైతే ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఉండగా మరికొందరు బిగ్గర గానే నవ్వుతున్నారు అలా మొత్తంగా త్రివిక్రమ్ తన రాతలతో అందరిని మైమరిపించాడు.

అలా కథ చెప్పడం ముగిసిపోయింది దాంతో ప్రొడ్యూసర్ స్రవంతి రవి కిషోర్ లేచి ఒక్కసారిగా మనమే ఈ సినిమా చేస్తున్నాం మన కాంబినేషన్ కచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని గట్టిగా చెప్పాడట. అప్పటికే నువ్వు నేను సినిమాకి పనిచేస్తున్న టీం కావడంతో మరో సినిమా కూడా చేయడానికి అడ్వాన్స్ కూడా ఇచ్చేసాడట స్రవంతి రవికిషోర్. ఆ స్క్రిప్ట్ తన టేబుల్ పైన ఇప్పటికి పెట్టుకుంటాడు అంటే నమ్ముతారా ? ప్రతి సినిమాకి స్క్రిప్ట్ ముఖ్యమని నమ్మే ఏకైక ప్రొడ్యూసర్ రవి కిషోర్.

 

అలా ఇప్పటికి తన టేబుల్ పై నువ్వు నాకు నచ్చావ్ సినిమా కథను పెట్టుకున్నారు. ఇక సినిమా తీయాలి అని అనుకోవడమే ఆలస్యం సినిమాకి సంబంధించిన హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు నటీనటులు ఎవరు అనే విషయాన్ని కన్ఫామ్ చేసుకోవాల్సిన పరిస్థితి. మొదట హీరోగా వెంకటేష్ ని ఓకే చేసుకున్నారు. కథ చెప్పగానే వెంకటేష్ ఓకే అనేసాడు. ఇక ఆ తర్వాత హీరోయిన్‌గా త్రిష అనుకున్నారు. కానీ ఆమె ఎందుకో ఈ కథని ఒప్పుకోలేదు దాంతో ఈ హీరోయిన్ అవకాశం ఎవరికీ ఇవ్వాలా అని టెన్షన్ పడుతున్నారు సినిమా యూనిట్.

దాంతో దర్శకుడు విజయభాస్కర్ పెట్టా బేడా సర్దుకుని ముంబై కి వెళ్ళాడు. అక్కడ ఒక హీరోయిన్ దొరక్క పోతుందా అని మోడల్ ఏజెన్సీల చుట్టు తిరుగుతున్నాడట. అక్కడ ఒక స్టూడియోలో మోడల్స్ ఫొటోస్ చూస్తున్న విజయభాస్కర్ కంట్లో ఒక అమ్మాయి పడింది. ఆ అమ్మాయి మరెవరో కాదు ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా పాగల్ బన్ అనే హిందీ చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఆ అమ్మాయి న్యూయార్క్ వెళ్ళిపోయింది. వెళ్లినప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీతో కానీ, ఇండియాలో ఎలాంటి కాంటాక్ట్స్ లేకపోవడంతో ఆమెని పట్టుకోవడం ఎంతో కష్టం అయింది.

కానీ ఆ ఫొటోస్ అన్నీ కూడా హైదరాబాద్ పంపించిన విజయభాస్కర్, తన టీమ్ సలహాల కూడా తీసుకున్నాడు. హీరోయిన్‌గా ఆర్తి అగర్వాల్ కావాలని అందరూ ఫిక్సయ్యారు. ఆ రోల్ కి చక్కగా సరిపోతుంది అని చెప్పడంతో ఖచ్చితంగా ఆమె హీరోయిన్ అని డిసైడ్ అయిపోయారు విజయ భాస్కర్. ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి సురేష్ బాబు దగ్గరికి వెళ్లి కూర్చున్నారు. సురేష్ బాబు స్వయంగా న్యూయార్క్‌లో ఉన్న తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి విషయం మొత్తం వివరించాడు. అక్కడ ఉన్న ఆర్తి అగర్వాల్ కోసం వెతకడం ప్రారంభించారు. అలా ఆమె దొరకడం, అక్కడే ఆమెకు క‌థ చెప్పించి.. ఇండియాకు ర‌ప్పించ‌డం.. ఆమెతో సినిమా చేయ‌డం సూప‌ర్ హిట్ అవ్వ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.

ఇలా త్రివిక్రమ్ అన్న ఒక్క మాట తోనే న్యూయార్క్ నుంచి ఆర్తి అగర్వాల్ టాలీవుడ్లోకి సరాసరి దిగిపోయింది. అలా త్రివిక్రమ్ రాసిన చేతి రాత ఆర్తి తల రాతగా మారిపోయింది. అలా నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో నటించి, ఆ సినిమా ఎంత పెద్ద ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఆమె కొన్నాళ్లపాటు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది ఆ తర్వాత అనారోగ్యంతో ఆమె అకాల మ‌ర‌ణం చెందింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news