MoviesKeerthi Suresh బ‌రి తెగించి అందాలు ఆర‌బోయ‌డానికి ఇదే కార‌ణ‌మా...!

Keerthi Suresh బ‌రి తెగించి అందాలు ఆర‌బోయ‌డానికి ఇదే కార‌ణ‌మా…!

కథా బలమున్న సినిమాలతోనే క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్స్ మన సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ. అలాంటి వారికి ఎక్కువకాలం అవకాశాలు దక్కడం కష్టమే. మహానటి సావిత్రితో కొన్ని సందర్భాలలో పోల్చుకున్న సౌందర్య కూడా కెరీర్ ప్రారంభంలో మళ్ళీ క్రేజ్ తగ్గుతుందేమో అనుకున్న సమమ్యంలో అందాల ఆరబోతకు వెనకాడలేదు. దీనికి ఉదాహరణ హలో బ్రదర్, అన్నయ్య, జయం మనదేరా లాంటి సినిమాలే. అయితే, సౌందర్య సంపాదించుకున్న పాపులారిటీ అసాధారణం. దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించిన క్రెడిట్ ఉంది.

ఆ తర్వాత చాలామంది సౌందర్య లాగా పేరు తెచ్చుకోవాలని ట్రై చేసినా కుదరలేదు. ఎందుకంటే జనరేషన్స్ మారుతున్నాయి. కథలు, పాత్రలు మారుతున్నాయి. హీరోయిన్స్ అల్ట్రా మోడ్రన్‌గా కనిపిస్తేనే టాలెంట్ అంతగా లేకపోయినా అందాల ఆరబోతతో, స్కిన్ షోతో, లిప్ లాకులతో కొంతకాలం నెట్టుకొస్తున్నారు. గ్లామర్‌గా కనిపిస్తున్నందుకే డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఒప్పుకుంటున్న సినిమాలలో హీరోయిన్ అందాల ఆరబోత పాత్రలే ఎక్కువగా ఉంటున్నాయి.

పుష్ప రష్మిక చేసినటు వంటి పాత్రలు చాలా అరుదుగా వస్తున్నాయి. సాయి పల్లవి, కీర్తి సురేష్ అందాల ఆరబోతకు ఆమడ దూరం ఉంటున్నారు. కీర్తికి మహానటి తర్వాత హిట్ అనేది ఒక్కటి కూడా తన ఖాతాలో మళ్ళీ ఇప్పటివరకు చేరలేదు. కానీ, సాయి పల్లవి అందాల ఆరబోత పాత్రలు చేయకుండానే మిగతా హీరోయిన్స్ స్థాయిలో ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ క్రేజ్‌తో దూసుకెళుతోంది. కానీ, ఈ విషయంలో కీర్తి కాస్త కాంప్రమైజ్ అయింది. గ్లామర్ రోల్స్ చేస్తేనే ఇక నెట్టుకొస్తానేమో అని ఆలోచించుకుంది.

అందుకే, సర్కారువారి పాట సినిమాలో తన పాత్ర ఒక మోస్తారుగా అందాల ఆరబోతతో మోత మోగించింది. వరుస ఫ్లాప్స్ వస్తుంటే హద్దులు దాటే విషయంలో కాస్త తెగించినా తప్పులేదనుకుందేమో..రెండు పాటల్లో బాగానే ఎక్స్‌ఫోజింగ్ చేసింది. మాస్ హీరోయిన్‌గా బాగానే పేరు తెచ్చుకుంది. ఇప్పుడు మేకర్స్ కీర్తిలో గ్లామర్ యాంగిల్ చూస్తున్నారు. ఆ తరహా పాత్రలను తయారు చేస్తున్నారు. రానున్న సినిమాలలో కీర్తి నుంచి మరింత అందాల ఆరబోత ఉంటుందని ఆశించవచ్చు.

తప్పదు మరి ఒకవైపు పూజా హెగ్డే, రష్మిక మరోవైపు కృతిశెట్టి, శ్రీలీల, కేతిక శర్మ జనాలకు హీటు పెంచుతున్నారు. ఇప్పుడు కూడా మంచు బట్టిలా ఉంటే కష్టం కదా. అదే కీర్తికి కాస్త లేటుగా అర్థమైనట్టుంది. అందుకే సర్కారు వారి పాట నుంచి కాస్త తనలోని గ్లామర్ యాంగిల్ చూపించడం మొదలుపెట్టింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news