Moviesఆ హీరోయిన్ తో గొడవ ..అసలు విషయం బయట పెట్టి షాక్...

ఆ హీరోయిన్ తో గొడవ ..అసలు విషయం బయట పెట్టి షాక్ ఇచ్చిన అనిల్ రావిపూడి..!!

సినీ ఇండస్ట్రీలో ఉన్నది లేనట్ట్లు ..లేనిది ఉన్నట్లు చూపించడం కామన్..అలాగే హీరోయిన్ల పై గాసిప్ లు రావడం కూడా కామన్. అస్సలు గాసిప్ రాని హీరోయిన్ ఎవ్వరైనా ఉన్నరా..అంటే లేదు అనే సమాధానం వినిపిస్తుంది. ఎన్ని గాసిప్ లు వస్తే..అంత పాపులర్ అయ్యిన్నట్లు అనుకోవాల్సిందే. అలా హీరోయిన్ తమన్నా పై ఓ క్రేజీ రూమర్ నెట్టింట పెద్ద దుమారమే రేపుతుంది. దీంతో ఇండస్ట్రీ వర్గాలు కూడా ఈ రూమర్ పై ఇంట్రెస్టింగా ఉన్నారు.

మనకు తెలిసిందే ..తమన్న రీసెంట్ గా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన F3 సినిమాలో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా నటించింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యినప్పటికి ..తమన్నాకి అనుకున్నంత పేరు రాలేదు. దీనికి కారణం, ఆమెకు సినిమాలో కంటెంట్ లేదు అంటున్నారు జనాలు. నిజానికి F2 సినిమా లో తమన్నా పై చాలా ఫన్నీ సీన్స్, రొమాంటిక్ సీన్స్ చూయించాడు అనిల్. కానీ, F3 లో మాత్రం మొత్తం డబ్బు చుట్టే తిరుగుతుంది. దీంతో డబ్బు నే హైలెట్ చేశాడు అనిల్.

పైగా అప్పటి వరకు సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అంటు చెప్పుకొచ్చిన అనిల్..సినిమా సగంలో కొత్త గా సోనాలి చౌహాన్ ను తీసుకొచ్చి..తమన్నాని అబ్బాయిగా మార్చేసి..తమన్నా గ్లామర్ కి బ్రేకులు వేశాడు. దీంతో తమన్నా సినిమాలో బిస్కెట్ అయ్యింది. ఆ విషయం పై కోపంగా ఉన్న తమన్నా..అందుకే సినిమా ప్రమోషన్స్ కి కూడా రాలేదంటూ ఓ వార్త తెగ వైరల్ గా మారింది. ఇక ఇదే విషయాని అనిల్ రావిపూడి ని ఇంటర్వుల్లో అడిగారు. అందరి డౌట్లని క్లీయర్ చేస్తూ..”అలాంటిది ఏం లేదు ..తమన్నా చాలా మంచిది. ఆ టైంలో తను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉంది..అందుకే రాలేకపోయింది. తమన్నా అందరితో కలిసి మెలిసి ఉంటుందని ” చెప్పి గాసిప్ రాయళ్లకు బిగ్ షాక్ ఇచ్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news