Moviesఈ మాస్ హీరో ముద్దు పెడితే.. పరిస్ధితి అంత దారుణంగా ఉంటుందా..?

ఈ మాస్ హీరో ముద్దు పెడితే.. పరిస్ధితి అంత దారుణంగా ఉంటుందా..?

ఈ మధ్య కాలంలో సినిమాలో కధ ఉన్నా లేకపోయినా.. సినిమా లో మాట్రం హాట్ సీన్స్, బెడ్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ ఖచ్చితంగా ఉంటున్నాయి. జనాలు చూస్తున్నారు కదా అని డైరెక్టర్స్ అలాంటి సీన్స్ తెరకెక్కిస్తున్నారో..లేక తీసే డైరెక్టర్స్ కి లేని సిగ్గులు మనకు ఎందుకో అనుకుని జనాలు ఎగబడి చూస్తున్నారో అర్ధం కావడం లేదు కానీ.. సినిమాల్లో రోమాన్స్ సీన్స్ పీక్స్ వెళ్లిపోతున్నాయి. హద్దులు దాటేస్తున్నాయి. యంగ్ హీరోలే కాదు.. సీనియర్ హీరోలు.. ఓ మొస్తరు గా ఏజ్ దాటినా హీరోలు ముద్దులతో చెలరేగిపోతున్నారు. ఆ లిస్త్ లోకే వస్తాడూ మాస్ రాజా మహరాజ రవి తేజ.

ఒకప్పుడు ఈ హీరో సినిమా లు రిలీజ్ అవుతున్నాయంటే.. మాస్ అభిమానులు కాలర్ ఎగరేసి మేము అన్న ఫ్యాన్స్ అని అరిచి చెప్పే వాళ్లు. కానీ ప్రజెంట్ పరిస్ధితి టోటల్ గా మారిపోయింది. సినిమా హిట్ సంగతి పక్కన పెడితే.. కనీసం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం కూడా గగనం అయిపోతుంది. ఏదో గోపిచంద్ మల్లినేని పుణ్యమా అని క్రాక్ సినిమా హిట్ అయ్యిందే కానీ.. గత కొంత కాలంగా రవి తేజ కెరీర్ లో క్రాక్ తప్పిస్తే ఒక్క హిట్ కూడా లేదు. అయితే, ఈసారి మాత్రం రామారావు ఆన్ డ్యూటీ.. సినిమా తో హిట్ దక్కించుకుంటాడు అని ఆశలు పెట్టుకున్న అభిమానులకు ఓ బ్యాడ్ సెంటిమెంట్ అడ్డోస్తుంది.

రవితేజ ఈ సినిమాలో హీరోయిన్ తో లిప్ లాక్ చేశాడు. రీసెంట్ గా సినిమా నుంచి సొట్ట బుగ్గ అనే పాట‌ విడుద‌ల చేశారు మేకర్స్. ఈ సాంగ్ లో ర‌వితేజ‌, దివ్యాంశ కౌశిక్‌ల మ‌ధ్య కెమిస్ట్రీ ఒక రేంజ్‌లో ఉంది. ముఖ్యంగా ర‌వితేజ హీరోయిన్‌కు లిప్‌లాక్ ఇచ్చే సీన్‌ను ఇందులో చూపించారు. దీంతో ర‌వితేజ ఫ్యాన్స్ టెన్షన్ పెడుతున్నారు. ఎందుకంటే రవితేజ లిప్ లాక్ చేస్తే ఆ సినిమా దొబ్బేస్తుంది. గతం లో మనం చూస్తే.. ఇలానే కిక్ 2 ర‌కుల్ ప్రీత్‌కు, ప‌వ‌ర్ సినిమాలో రెజీనాకు, ఖిలాడి మూవీలో డింపుల్ హ‌య‌తి, మీనాక్షి చౌద‌రిల‌కు ర‌వితేజ లిప్‌లాక్ ఇచ్చారు.

మూడు సినిమాలల్లో రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. పవర్ సినిమా పర్లేదు అనిపించింది. ఇక తాజాగా రామారావు ఆన్‌డ్యూటీలోనూ లిప్ కిస్ చేశాడు రవి. దీంతో ఫ్యాన్స్ భయపడుతున్నారు..ఈ సినిమాతో అయినా హిట్ కొడుతావు అనుకుంటే..ఇలా చేశావ్ ఏంటి అన్నా..అంటూ దండాలు పెట్టేస్తున్నారు. మరి చూడాలి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news