Moviesవదిలేసి తప్పు చేశా.. తెగ బాధ పడిపోతున్న మెహ్రీన్..!!

వదిలేసి తప్పు చేశా.. తెగ బాధ పడిపోతున్న మెహ్రీన్..!!

తన లేలేత అందాలతో కుర్రాళ్ల కు చమటలు పట్టిస్తున్న బ్యూటీ..మెహ్రీన్. నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీరప్రేమ గాధ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటి ..ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాని తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత బడా బడా ఆఫర్లు వచ్చినా తెలిసో తెలియకనో..మంచి ఆఫర్స్ మిస్ చేసుకుని..సోది సినిమాలకు ఓకే చేసి..ఫలితంగా అట్టర్ ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆ టైంలో అనిల్ రావిపుడి F2 లొ అవకాశం ఇచ్చి..మళ్లీ ఫాం లోకి తెచ్చాడు .

ఈ సినిమా లో అమ్మడు హనీ పాత్రలో మెరిసింది. వరుణ్ కంత్రి గార్ల్ ఫ్రెండ్ గా అందరిని తన నటన తో ఫిదా చేసింది. ఇక ఆతరువాత కొన్ని సినిమాలు చేసిన వాటిల్లో మహానుభావుడు సినిమా తప్పిస్తే..మనం చెప్పుకొతగ్గ సినిమాలు ఏం లేవు. ఆ తరువాత సడెన్ గా మెహ్రీన్ గ్రాండ్‌గా భవ్య భిష్ణోయ్‌తో నిశ్చితార్థం జరగడంతో ఇక పెళ్లి వేడుకే అని అంతా అనుకున్నారు. కానీ అంతలోపే మెహ్రీన్ షాక్ ఇచ్చారు. భవ్య భిష్ణోయ్‌తో జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నామని, ఇకపై ఇంతటితోనే తమ బంధం ముగిసిందని పెళ్లి పెటాకులైనట్టు ప్రకటించేశారు మెహ్రీన్.


ఆ తరువాత మళ్లీ అవకాశాలు మొదలైయాయి. తాజా గా ఆమె నటించిన F3 సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె మాట్లాడుతూ..కెరీర్ స్టార్టింగ్ లో అల్లు అర్జున్ తో అవకాశం వస్తే కొన్ని కారణాల వల్లన్ మిస్ చేసుకున్నాను అని చెప్పుకొచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్. కెధరిన్ హీరోయిన్లు గా అల్లు అర్జున్ హీరో గా నటించిన సరైనోడు సినిమాలో హీరోయిన్ గా ముందు అనుకున్నింది మెహ్రీన్ అట. కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో ఆ హిట్ రకుల్ కి పడింది. ఇక ఇదే విషయాని గుర్తు చేసుకుని..”ఆ రోజు సరైనోడు సినిమా చేసుంటే..నా కెరీర్ ఇంకా బాగుండేది”అని చెప్పుకొచ్చింది. ఇక F3 సినిమా మే27 న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news