Movies' స‌ర్కారు వారి పాట ' టైటిల్ ట్రాక్.. మాస్‌కు పూన‌కాలే......

‘ స‌ర్కారు వారి పాట ‘ టైటిల్ ట్రాక్.. మాస్‌కు పూన‌కాలే… (వీడియో )

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 2020 సంక్రాంతికి స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అల వైకుంఠ‌పురంలో లాంటి సూప‌ర్ హిట్ సినిమాకు పోటీగా వ‌చ్చిన ఈ సినిమా కూడా సూప‌ర్ హిట్ అయ్యింది. అస‌లు స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాకు వ‌చ్చిన ఓపెనింగ్స్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కే షాక్ ఇచ్చాయి. ఆ సినిమా త‌ర్వాత మ‌ళ్లీ మ‌హేష్ న‌టించిన సినిమా ఏ ఒక్క‌టి రిలీజ్ కాలేదు.

అటు గీత‌గోవిందం సినిమా త‌ర్వాత ద‌ర్శ‌కుడు ప‌ర‌శురాం క్రేజ్ ఎలా ? పెరిగిపోయిందో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌కు తోడు .. అటు కీర్తి సురేష్ లాంటి హీరోయిన్ కూడా తోడ‌వ్వ‌డంతో స‌ర్కారు వారి పాట సినిమాపై అంచ‌నాలు అయితే ఆకాశంలోనే ఉన్నాయి. సినిమాకు ముందే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో పాజిటివ్ వైబ్రేష‌న్స్ స్టార్ట్ అయిపోయాయి.

ఇక ఇప్ప‌టికే రిలీజ్ అయిన సాంగ్స్ అయితే యూట్యూబ్‌ను పిచ్చ‌పిచ్చ‌గా షేక్ చేసి ప‌డేస్తున్నాయి. ఇక అభిమానుల‌కు మ‌రింత కిక్ ఇచ్చేలా ఈ రోజు ఈ సినిమా టైటిల్ ట్రాక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టైటిల్ సాంగ్ ట్రాక్ వింటుంటేనే ఎవ్వ‌రి అంచ‌నాల‌కు అంద‌కుండా ఓ మెట్టు పైనే ఉంద‌నే చెప్పాలి. స‌ర్కారు వారి పాట రివ‌ర్స్ లేని బాట‌.. ఎవ‌డ్నైనా కొడితే మాడు ప‌గిలిపోద్ద‌ట‌.. ఇలా ప‌దునైన ప‌దాలే ఉన్నాయి.

సాంగ్ వింటుంటే మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌ని అనిపిస్తోంది. మ‌హేష్ స్టైల్స్‌, లుక్స్‌, మేన‌రిజ‌మ్ అయితే చంపేస్తోంది. ఇక ట్రాక్‌లో బ్యాంకు చెక్ బుక్‌లు, లాక‌ర్ తాళాలు.. విల‌న్ల‌ను చిత‌క‌బాద‌డాలు లాంటివి చూస్తుంటే మాస్‌కు థియేట‌ర్ల‌లో పూన‌కాలే అని అర్థ‌మ‌వుతోంది. మ‌హేష్ – థ‌మ‌న్ కాంబినేష‌న్ అంటే ఎలాంటి అంచ‌నాలు ఉంటాయో ఆ అంచ‌నాల‌కు ఈ ట్రాక్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు.

పాట పాడిన హారిక నారాయ‌ణ‌న్ కూడా అదిరిపోయే బేస్ వాయిస్‌తో ఆక‌ట్టుకున్నారు. ఇక వీడియో చివ‌ర్లో మే 12న బాక్సాఫీస్ రిక‌వ‌రీకి స‌ర్కారు వారి పాట సిద్ధంగా ఉంద‌ని క్లారిటీతో రిలీజ్ డేట్ చెప్పేశారు. న‌వీన్ ఎర్నేని – య‌ల‌మంచిలి ర‌వి శంక‌ర్ – రామ్ ఆచంట‌, గోపీ ఆచంట ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news