Moviesప‌వ‌న్ కొడుకు అకీరా ఫ‌స్ట్ సినిమా ఆ స్టార్ డైరెక్ట‌ర్ చేతుల్లోనే...?

ప‌వ‌న్ కొడుకు అకీరా ఫ‌స్ట్ సినిమా ఆ స్టార్ డైరెక్ట‌ర్ చేతుల్లోనే…?

టాలీవుడ్‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ క్రేజ్ గురించి ప్ర‌త్యేక వివ‌ర‌ణ‌లు అవ‌స‌రం లేదు. రెండున్న‌ర ద‌శాబ్దాలుగా ప‌వ‌న్ తిరుగులేని స్టార్ హీరోగా కొన‌సాగుతున్నాడు. ప‌వ‌న్ తెర‌మీద క‌నిపిస్తేనే ఓ సంచ‌ల‌నం. ప‌వ‌న్ రెండు, మూడేళ్లు సినిమా చేయ‌క‌పోయినా కూడా క్రేజ్ త‌గ్గ‌దు. జానీ త‌ర్వాత లాంగ్ గ్యాప్‌.. జ‌ల్సా త‌ర్వాత లాంగ్ గ్యాప్‌.. ఇక అజ్ఞాత‌వాసి త‌ర్వాత ఏకంగా మూడేళ్లు భారీ గ్యాప్ అయినా కూడా ప‌వ‌న్ సినిమా వ‌స్తుందంటే ఫ్యాన్స్ అంచనాలు తారాస్థాయిలోనే ఉంటాయి.

అజ్ఞాత‌వాసి త‌ర్వాత 2018 నుంచి 2021 మూడేళ్లు గ్యాప్‌. ఈ క్ర‌మంలోనే గ‌తేడాది వ‌చ్చిన వ‌కీల్‌సాబ్‌కు జ‌నాలు ఎగ‌బ‌డ్డారు. ఇక ఇటీవ‌ల వ‌చ్చిన భీమ్లానాయ‌క్ సినిమాకు ఏపీలో షోలు లేవ‌ని.. ఏకంగా హైద‌రాబాద్‌కు వెళ్లి మ‌రీ చూసి వ‌చ్చారు. ప‌వ‌న్ అంటే ఆయ‌న అభిమానుల‌కు ఓ పిచ్చి.. ఓ వ్య‌స‌నం. బండ్ల గ‌ణేష్‌కు మైకు దొరికి.. ముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉంటే ప‌వ‌న్ గురించి ఎంత‌లా భ‌క్తి ప్ర‌ద‌ర్శిస్తాడో తెలిసిందే. కానీ మ‌న‌కు క‌న‌ప‌డే బండ్ల మాత్ర‌మే కాదు.. బండ్ల‌ను మించిన వీరాభిమానులు ప‌వ‌న్‌కు ఎంతో మంది ఉన్నారు.

ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండో భార్య అయిన మాజీ హీరోయిన్ రేణు దేశాయ్ త‌న‌యుడు అకీరా నంద‌న్ కూడా వెండితెరంగ్రేటం చేసేందుకు రెడీ అవుతున్నాడు. పవన్ కుమారుడు అకీరా నందన్ పుట్టిన రోజు హడావుడి నిన్నటితో కంప్లీట్ అయ్యింది. త‌ల్లి రేణుదేశాయ్ సోష‌ల్ మీడియాలో ఓ వీడియో వ‌ద‌ల‌గా అది వైర‌ల్ అయ్యింది. అయితే రేణు మాత్రం అకీరాకు హీరో కావాల‌న్న ఉద్దేశం అయితే లేద‌ని చెప్పారు. వాస్త‌వంగా చూస్తే అకీరాను హీరోను చేసేందుకు తెర‌వెనక ఏర్పాట్లు చక‌చ‌కా జ‌రిగిపోతున్నాయ్‌..!

అకీరా ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాకు సైన్ చేయ‌లేదు. అయితే న‌టుడిగా శిక్ష‌ణ తీసుకుంటున్నాడు. అటు ఫైట్లు, ఇటు డ్యాన్సుల్లోనూ ర‌క‌ర‌కాల శిక్ష‌ణ‌లు తీసుకుంటున్నాడు. పైగా అకీరా త‌న చెల్లితో క‌లిసి ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ప‌వ‌న్ ద‌గ్గ‌రే ఉంటూ ఈ ర‌క‌ర‌కాల శిక్ష‌ణ‌లు తీసుకుంటున్నారు. ఇక అకీరా కొత్త సినిమా బాధ్య‌త‌లు అన్నీ స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌, సితార ఎంట్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌లోనే ఉంటాయ‌ని అంటున్నారు.

అయితే ఈ సినిమాకు త్రివిక్ర‌మే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారా ? లేదా ఆయ‌న క‌థ‌, ఇత‌ర బాధ్య‌త‌లు చూస్తూ మ‌రో ద‌ర్శ‌కుడి చేతిలో అకీరా లాంచింగ్ బాధ్య‌త‌లు పెడ‌తారా ? అన్న‌ది మాత్ర‌మే చూడాలి. అయితే మ‌రో యేడాది త‌ర్వాతే అకీరా ఫ‌స్ట్ సినిమా వ్య‌వ‌హారం ప‌ట్టాలు ఎక్కుతుంది. అప్ప‌టి వ‌ర‌కు అకీరా ఫుల్ ట్రైనింగ్‌లోనే ఉంటాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news