Moviesమోహ‌న్‌బాబుతో నాగ‌బాబు డైరెక్ట్ వార్‌... భ‌లే ట్విస్ట్ ఇచ్చాడే..!

మోహ‌న్‌బాబుతో నాగ‌బాబు డైరెక్ట్ వార్‌… భ‌లే ట్విస్ట్ ఇచ్చాడే..!

కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీ వ‌ర్సెస్ నాగ‌శ్రీను వివాదం న‌డుస్తోంది. నాగ‌శ్రీను మంచు ఫ్యామిలీపై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే కొంత కాలంగా మోహ‌న్‌బాబు వ‌ర్సెస్ మెగా ఫ్యామిలీ వార్ గ‌ట్టిగానే న‌డుస్తోంది. మా ఎన్నిక‌ల నుంచి కూడా ఇది మ‌రింత ఎక్కువుగా ఉంది. తాజాగా నాగశ్రీను అనే వ్యక్తి కుటుంబాన్ని తన దగ్గరకు పిలిపించుకున్న నాగబాబు ఓదార్చ‌డంతో పాటు తాను అండ‌గా ఉంటాన‌ని చెప్పారు. అంతేకాకుండా రు. 50 వేలు ఆర్థిక సాయం కూడా చేశారు.

ఇక నాగ శ్రీను మంచు ఫ్యామిలీ హెయిర్ డ్రెస్స‌ర్‌. త‌న ఆఫీసులో రు. 5 ల‌క్ష‌ల విలువైన హెయిర్ డ్రెస్సింగ్ సామ‌గ్రి కొట్టేశాడంటూ విష్ణు పోలీసు కేసు పెట్ట‌డంతో వెలుగులోకి వ‌చ్చాడు. మంచు కుటుంబం వ‌ద్ద ప‌దేళ్ల పాటు అత‌డు ప‌నిచేశాడు. అస‌లు ఇంట్లో ఏం జ‌రిగిందో తెలియ‌దు కాని.. విష్ణు కేసు పెట్ట‌డం, ఆ వెంట‌నే నాగ‌శ్రీను మీడియాకు ఎక్క‌డం.. మంచు మోహ‌న్‌బాబు, విష్ణుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఈ విష‌యం ఇప్పుడు ఇండ‌స్ట్రీ, మీడియా వ‌ర్గాల్లో బ‌ర్నింగ్ టాపిక్ అయ్యింది.

మోహ‌న్‌బాబు ఫ్యామిలీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన నాగ‌శీను సీసీ ఫుటేడ్ కూడా బ‌య‌ట పెట్టాల‌ని డిమాండ్ చేస్తున్నాడు. ఇక కులం పేరుతో త‌న‌ను మోహ‌న్‌బాబు తిట్టాడ‌ని నాగ‌శీను ఆరోపిస్తున్నాడు. దీంతో బీసీ సంఘాలు అత‌డికి మ‌ద్ద‌తుగా రంగంలోకి దిగాయి. ప‌లువురు నాగ‌శీనుకు స‌పోర్ట్ చేస్తున్నారు. మ‌రోవైపు బీసీ సంఘాల నేత ఆర్‌. కృష్ణ‌య్య మోహ‌న్‌బాబు వైసీపీ నాయ‌కుడు అయినా స‌రే.. త‌న‌కు వైసీపీ అంటే అభిమానం ఉన్నా కూడా మోహ‌న్‌బాబు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు.

మోహ‌న్‌బాబు బీసీల‌కు క్ష‌మాప‌ణ చెప్ప‌క‌పోతే ఆయ‌న అంతు చూస్తామ‌ని కూడా కృష్ణ‌య్య‌తో పాటు కొన్ని బీసీ సంఘాలు వార్నింగ్ ఇస్తున్నాయి. ఈ వార్ ఇలా న‌డుస్తూ ఉండ‌గానే నాగ‌శీనుకు మెగా క్యాంప్ అండ దొరికేసింది. నాగ‌బాబు పిలిచి మ‌రీ ఆర్థిక సాయం చేశారంటేనే మోహ‌న్‌బాబు మీద రివేంజ్ తీర్చుకోవ‌డానికే అన్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఇక ఈ గొడ‌వ‌పై అస‌లు మోహ‌న్‌బాబు ఫ్యామిలీ రియాక్ష‌న్ అన్న‌ది అయితే ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట‌కు రాలేదు. వాళ్లు మీడియా ముందుకు వ‌చ్చి మాట్లాడ‌డం లేదు. విష్ణు ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి రియాక్ష‌న్ తీసుకున్నారు అన్న‌ది కూడా క్లారిటీ లేదు. ఇక ఈ వివాదంలోకి నాగ‌బాబు ఎంట‌ర్ కావడంతో ర‌గులుతున్న అగ్నికి మ‌రింత ఆజ్యం పోసిన‌ట్టు అయ్యేలా క‌నిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news