Moviesఆ సినిమాలో అత్యాచారం సీన్‌.. ఆ హీరోయిన్‌ను అంత డిస్ట‌బెన్స్ చేసిందా...!

ఆ సినిమాలో అత్యాచారం సీన్‌.. ఆ హీరోయిన్‌ను అంత డిస్ట‌బెన్స్ చేసిందా…!

2000 సంవ‌త్స‌రంలో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో శ్రీకాంత్, వడ్డే నవీన్ కలిసి నటించిన చాలా బాగుంది సినిమా వ‌చ్చింది. ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతోనే టాలీవుడ్‌కు హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది మాళ‌విక‌. ఆ త‌ర్వాత ఆమె ముత్యాల సుబ్బ‌య్య ద‌ర్శ‌క‌త్వంలో ఉషాకిర‌ణ్ మూవీస్ దీవించండి – శుభ‌కార్యం – అప్పారావు డ్రైఇంగ్ స్కూల్ సినిమాల్లో కూడా న‌టించింది. చివ‌ర‌గా ఆమె ర‌జ‌నీకాంత్ ప‌క్క‌న చంద్ర‌ముఖి సినిమాలో క‌నిపించింది.

ఆ త‌ర్వాత ఆమె సినిమాల‌కు దూరం అయిపోయింది. మాళ‌విక సినిమాల‌కు దూరం అయ్యి అప్పుడే 12 ఏళ్లు కూడా గ‌డిచిపోయాయి. తాజాగా చాలా ఏళ్ల‌కు ఆమె ఆలీతో స‌రదాగా షోలో క‌నిపించింది. ఈ షో ప్రోమోలో మాళ‌విక ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పింది. తాను తెలుగులో మొత్తం ఐదు సినిమాలు చేశాన‌ని.. త‌మిళంలో 35 సినిమాలు చేశాన‌ని చెప్పింది.

తెలుగులో తాను న‌టించిన తొలి సినిమాలోనే రేప్ అత్యాచారం సీన్ ఉంద‌ని.. అది త‌న‌కు చాలా డిస్ట‌బింగ్‌గా అనిపించింద‌ని.. ఆ సీన్ తాను చేయ‌న‌ని చెప్పినా చివ‌ర‌కు చేయాల్సి వ‌చ్చింద‌ని చెప్పింది. అయితే ఓవ‌రాల్‌గా ఆ సినిమా చేయ‌డం త‌న‌కు సంతృప్తి ఇచ్చిన‌ట్టు మాళ‌విక తెలిపింది. అప్ప‌ట్లో తాను సీయు ఎట్ 9 అనే హిందీ సినిమా చేశాన‌ని.. చాలా గ్లామ‌ర్‌గా చేయాల్సి రావ‌డంతో ఇంట్లో పెద్ద ర‌చ్చ జ‌ర‌గ‌డంతో పాటు కుటుంబ స‌భ్యులు కోపంగించుకున్నార‌ని ఆమె చెప్పింది.

 

ఇక హీరోల్లో ఎవ‌రు అంటే ఇష్టం అన్న ప్ర‌శ్న‌కు మాళ‌విక అప్ప‌ట్లో నాగార్జున‌.. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ అని చెప్పింది. రీసెంట్‌గా తాను పుష్ప సినిమా చూశాన‌ని చెప్పిన ఆమె.. అందులో స‌మంత ఐటెం సాంగ్ బాగా న‌చ్చింద‌ని చెప్ప‌డంతో పాటు ఆమె అల్లు అర్జున్‌ను కింద నుంచి పై వ‌ర‌కు నొక్కే సీన్‌ను అనుక‌రించి చూపించింది. ఈ ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ త‌న‌కు వ‌చ్చినా చేసేదానిని అని చెప్పి షాక్ ఇచ్చింది.

ఇక బెంగ‌ళూరు, చెన్నై, ముంబైల‌లో ముంబైలో ఉండేందుకే తాను ఇష్ట‌ప‌డ‌తాన‌ని.. అక్క‌డ 24 గంట‌లు న‌గ‌రం నిద్ర‌పోకుండా ఉంటుంద‌ని.. త‌మ‌ది ప్రేమ వివాహం అని చెప్పింది. ఇక రాజేంద్ర‌ప్ర‌సాద్‌తో ఇష్యూ గురించి ఆమె న‌వ్వుతూ ఆన్స‌ర్ దాట‌వేసింది. ఈ ఎపిసోడ్ త్వ‌ర‌లోనే ప్ర‌సారం కానుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news