Moviesఅమ్మ బాబోయ్..జంబలకిడిపంబ సినిమా ద్వారా అన్నీ కోట్లు లాభాలు వచ్చాయా..?

అమ్మ బాబోయ్..జంబలకిడిపంబ సినిమా ద్వారా అన్నీ కోట్లు లాభాలు వచ్చాయా..?

జంబలకిడిపంబ ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ధియేటర్స్ కు వెళ్ళిన ప్రతి ఒక్కరికి నవ్వి నవ్వి కడుపులొ నొప్పి వచ్చేసిందంటే నమ్మండి..అంతలా నవ్వుకున్నారు జనాలు ఈ సినిమాను చూసి. జంబలకిడిపంబ ఇ. వి. వి సత్యనారాయణ దర్శకత్వంలో 1992 లో వచ్చిన ఒక విజయవంతమైన హాస్యభరిత సినిమా. సుప్రసిద్ధ దర్శకుడు జంధ్యాల శిష్యుడిగా అనేక సినిమాలకు పనిచేసారు ఈవీవీ. ఇందులో నరేష్, ఆమని ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో మహిళలు ఎదుర్కొనే సమస్యల గురించి ఆడవాళ్ళ పనులు మగవారు, మగవాళ్ళ పనులు ఆడవాళ్ళు చేస్తే ఎలా ఉంటుందో వినోదభరితంగా తెరకెక్కించారు.

50 లక్షల రుపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలోని కామెడీ తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఐరన్ లెగ్ శాస్త్రి, బ్రహ్మానందం, ఆలీ, బాబు మోహన్, కోట శ్రీనివాస రావు, మల్లికార్జున రావు, శ్రీ లక్ష్మి లాంటి కమెడియన్స్‌తో ఈవీవీ చేసిన ప్రయోగం ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికి ఈ సినిమాను టీవిలో వస్తే చూసి నవ్వుకునే జనం లేకపోనూలేదు. మనలో కూడా ఎంతో మంది ఈ సినిమాలోని కామెడీ క్లిప్పింగ్స్ ను యూట్యూబ్ లో సెర్చ్ చేసిన్ మరి చూసి నవ్వుకుంటుంటాం. అంత బాగా జనాలకు నచ్చింది ఈ సినిమా.

అయితే ఈ మూవీ రూపొందించే సమయంలో కొందరు టాప్ డైరెక్టర్ల నుంచి నెగెటివ్ కామెంట్స్ వచ్చాయట. ఈ కాన్సెప్ట్ గురించి తెలిసి విడుదలకు ముందు చాలా మంది విమర్శించారట. కొందరు అయితే వ్యభ్చారం చేసి డబ్బులు సంపాదించుకోవచ్చుగా ఇలాంటి సినిమాలు తీసే బదులు అంటూ హేళన గా మాట్లాడారట. ఇక వైజాగ్ పరిసర ప్రాంతాల్లో కేవలం రూ.50లక్షల బడ్జెట్‌తో నెల రోజుల్లోనే సినిమా పూర్తి చేసేశారు. కాగా ఈ సినిమా మొత్తంగా రూ.2కోట్ల రాబట్టింది. విజయవాడ, కాకినాడల్లో 100 రోజులు ఆడింది. ముఖ్యంగా స్కూల్‌ నేపథ్యంలో వచ్చే కామెడీ సన్నివేశం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఈ సినిమా వచ్చి 28ఏళ్లయినా ఇంకా నవ్వులు పూయిస్తూనే ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news