Movies70 ఏళ్ల సినీ చ‌రిత్ర‌లో గుంటూరులో ఆ రికార్డ్ మ‌హేష్‌దే... ఇప్ప‌ట‌కీ...

70 ఏళ్ల సినీ చ‌రిత్ర‌లో గుంటూరులో ఆ రికార్డ్ మ‌హేష్‌దే… ఇప్ప‌ట‌కీ చెక్కు చెద‌ర్లేదు..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా రిలీజ్ అవుతుందంటే తెలుగు ప్రేక్షకుల్లో ఎంత హంగామా ఉంటుందో తెలిసిందే… మ‌హేష్ అభిమానులు ఆ రోజు సంబరాలు చేసుకుంటారు. ఇక సినిమా రిలీజ్ రోజున వారి ఆనందానికి అంతే ఉండదు. మిగిలిన ప్రాంతాల కన్నా మహేష్ సొంత జిల్లా అయిన గుంటూరు జిల్లాలో అయితే పెద్ద పెద్ద ర్యాలీలు చేసి మహేష్ పై తమ అభిమానం చాటుకుంటారు. మహేష్ స్వగ్రామం గుంటూరు జిల్లాలోని తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెం. అందుకే కృష్ణ‌ను అభిమానులు ముద్దుగా బుర్రిపాలెం బుల్లోడు అని పిలుచు కుంటూ ఉంటారు.

మహేష్ సినిమా వస్తుందంటే గుంటూరు జిల్లా అంతా పెద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. ప్రత్యేకించి గుంటూరు నగరంలో మహేష్ బాబుకు అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు. మహేష్ సినిమా రిలీజ్ అయింది అంటే కనీసం 15 థియేటర్లలో తొలి రోజు షోలు ప్రదర్శిస్తారు. అయినా సరే ఒక్కోసారి టికెట్లు దొరకని పరిస్థితి ఉంటుంది. సాధారణంగా గుంటూరు లాంటి చోట్ల ఒక సినిమా తొలి రెండు వారాలు ఎన్ని థియేటర్లలో ఆడినా… ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక థియేటర్లలో 50 రోజులు ఆడితే గొప్ప అనుకోవాలి. అలాంటిది మహేష్ నటించిన దూకుడు ఒక గుంటూరు సిటీలోనే ఏకంగా మూడు థియేటర్లలో 50 రోజులు ఆడింది.

ఇన్ని సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో గుంటూరు పట్టణంలో ఒక హీరో నటించిన సినిమా మూడు థియేటర్లలో 50 రోజులు ఆడటం తెలుగు లేని రికార్డ్‌గా నిలిచింది. దూకుడు సినిమా గుంటూరు వన్ టౌన్ లో భాస్కర్ డీలక్స్ తో పాటు సరస్వతి థియేటర్లోనూ, టూ టౌన్ లో హాలీవుడ్ లోనూ 50 రోజులు ఆడింది. అంతకు ముందు జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి, రామ్ చరణ్ మగధీర సినిమాలు రెండు కేంద్రాల్లో 50 రోజులు ఆడాయి. అయితే దూకుడు సినిమా ఆ రెండు సినిమాల‌ రికార్డులను బ్రేక్ చేసి 3 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. భాస్కర్ డీలక్స్ లో ఏకంగా 150 రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేసింది.

అయితే దూకుడు సినిమాను కావాలనే మూడు థియేట‌ర్ల‌లో 50 రోజులు ఆడించాలని అప్పట్లో రామ్‌చ‌రణ్ అభిమానులు విమ‌ర్శ‌లు చేశారు. సినిమాకు హిట్ టాక్ రావడంతో దూకుడు బాగా ఆడిందని మహేష్ బాబు అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఏదేమైనా ఈ రికార్డు ఇప్పటికీ మహేష్ బాబు పేరిట అలా ఉండిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news