Moviesలేత హీరోలే ముద్దంటోన్న ముదురు హీరోయిన్లు...!

లేత హీరోలే ముద్దంటోన్న ముదురు హీరోయిన్లు…!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల‌కు లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుందన్న అభిప్రాయాలు ఉంటాయి. ఒక సమయంలో స్టార్ హీరోలుగా స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా నటించిన వారే ఆ తర్వాత అదే హీరోకి అక్క, అమ్మ పాత్రలు పోషిస్తూ ఉంటారు. అంతెందుకు ఎన్టీఆర్ కు ఒక సినిమాలో మనవరాలిగా నటించిన అతిలోక సుందరి శ్రీదేవి తర్వాత అదే ఎన్టీఆర్ ప‌క్కన హీరోయిన్ గా నటించింది. హీరోల వయసు 60 ఏళ్లు దాటుతున్నా… హీరోయిన్లు 25 ఏళ్ల‌లో ఉన్నా కూడా ఆ ముస‌లి హీరోల‌తో రొమాన్స్ చేయ‌క త‌ప్ప‌డం లేదు.

ఆ హీరోల‌కు స్టార్ ఇమేజ్ ఉంది. వారి ప‌క్క‌న న‌టిస్తే త‌మ కెరీర్ ట‌ర్న్ అవుతుంద‌న్న ఆశ‌తోనో లేదా రెమ్యున‌రేష‌న్ ఎక్కువ ఇస్తున్నార‌నో కొంద‌రు కుర్ర హీరోయిన్లు ముస‌లి హీరోల ప‌క్క‌న న‌టిస్తున్నారు. ఇప్పుడు సౌత్‌లో ఇదే ట్రెండ్ ఉంది. అయితే ఇప్పుడు దీనికి రివ‌ర్స్‌లో కూడా జ‌రుగుతోంది. ముదురు ముద్దుగుమ్మ‌లు సీనియ‌ర్ హీరోల‌తో మాత్ర‌మే కాదు.. లేత హీరోల‌తో కూడా జోడీ క‌డుతున్నారు. ఈ కాంబినేష‌న్లే ఇంట్ర‌స్టింగ్‌గా ఉంటున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

అనుష్క శెట్టి – న‌వీన్ పోలిశెట్టి :
అనుష్క తెలుగు సినిమా ఇండ‌స్ట్రీని ప‌దిహేను సంవ‌త్స‌రాలుగా ఏలుతోంది. వ‌య‌స్సు కూడా మూడున్నర ప‌దులు దాటేసి నల‌భైకు చేరువ‌లో ఉంది. ఇప్ప‌ట‌కీ పెళ్లి చేసుకోలేదు. ఎంత అవుట్ డేటెడ్ అయినా ఆమెకు భారీగా అభిమానులు ఉన్నారు. అనుష్క‌తో కంపేరిజ‌న్ చేస్తే జాతిర‌త్నాలు హీరో న‌వీన్ పోలిశెట్టి చాలా చిన్న పిల్లాడు. అయితే ఇప్పుడు అనుష్క‌, న‌వీన్‌తో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. షెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి పేరుతో వ‌స్తోన్న సినిమాలో వీరు జోడీ క‌డుతున్నారు.

స‌మంత – దేవ్‌మోహ‌న్ :
స‌మంత నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇచ్చేశాక మ‌రింత‌గా రెచ్చిపోతోంది. వ‌రుస పెట్టి సినిమాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇస్తోంది. పైగా హాట్ డోస్ మ‌రింత పెంచుతోంది. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న శాకుంత‌లం సినిమాలో మ‌ళ‌యాళ హీరో దేవ్‌మోహ‌న్‌తో క‌లిసి న‌టిస్తోంది. ఇక స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ య‌శోద‌లో ముకుంద‌న్‌తో న‌టిస్తోంది.

నాగ‌శౌర్య – కీర్తి సురేష్‌:
వీరిద్ద‌రి మ‌ధ్య మ‌రీ అంత అంత‌రం అయితే ఉండ‌దు. మెగాస్టార్ భోళా శంక‌ర్ సినిమాలో చిరుకు చెల్లిగా నటిస్తోన్న కీర్తి సురేష్‌కు జోడీగా యంగ్ హీరో నాగ‌శౌర్య న‌టిస్తున్నాడు.

దీపికా ప‌దుకొనే – సిద్ధార్థ్ చ‌తుర్వేది :
ఈ ట్రెండ్ తెలుగులో మాత్ర‌మే కాదు.. బాలీవుడ్‌లో కూడా కంటిన్యూ అవుతోంది. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ హీరోయిన్లు వ‌య‌స్సులో త‌మ కంటే చిన్న వాళ్ల‌నే పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా దీపికా ప‌దుకునే – సిద్ధార్థ్ క‌లిసి గేహ‌రాయ‌న్ సినిమాలో న‌టిస్తున్నారు.

క‌త్రినా కైఫ్ – విజ‌య్ సేతుప‌తి :
కోలీవుడ్‌లో పాపుల‌ర్ అయిన విజ‌య్ సేతుప‌తి… బాలీవుడ్ క్రేజీ సీనియ‌ర్ హీరోయిన్ క‌త్రినా కైఫ్‌తో క‌లిసి ఓ సినిమా చేస్తున్నాడు. క‌త్రినా క్రేజ్‌తో పోలిస్తే విజ‌య్ సేతుప‌తికి కాస్త త‌క్కువ క్రేజే ఉంటుంది. ఈ కాంబోలో సినిమా కోసం ఇప్పుడు వీరు ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు.

ప్ర‌తీక్ గాంధీ – విద్యాబాల‌న్ :
బీ టౌన్ సీనియ‌ర్ హీరోయిన్ విద్యాబాల‌న్ .. త‌న‌కంటే చాలా చిన్న ఏజ్ హీరో అయిన ప్ర‌తీక్ గాంధీతో రొమాన్స్ చేయ‌బోతోంది. ఏదేమైనా ఇప్పుడు సౌత్ టు నార్త్‌లో ఈ కొత్త ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సుకు పైన ఉన్న హీరోయిన్ల‌తో ఇప్పుడు యంగ్ హీరోలు రొమాన్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news