Moviesచిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్‌గా ప‌నిచేసి చిరంజీవికే సూప‌ర్ హిట్లు ఇచ్చిన డైరెక్ట‌ర్‌..!

చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్‌గా ప‌నిచేసి చిరంజీవికే సూప‌ర్ హిట్లు ఇచ్చిన డైరెక్ట‌ర్‌..!

మెగాస్టార్ చిరంజీవి ఎంతో మంది దర్శకుల కలల హీరో. ఎంత పెద్ద గొప్ప దర్శకుడు అయినా చిరంజీవి తో ఒక్క సినిమా అయినా డైరెక్ట్ చేయాలని కలలు కంటూ ఉంటారు. రాఘవేంద్రరావు – కోదండరామిరెడ్డి – బి.గోపాల్ – విజయబాపినీడు ఇలా ఎంతో మంది అగ్ర దర్శకులు చిరంజీవితో పని చేసి సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. అయితే ఒక దర్శకుడు మాత్రం తన చిన్నప్పుడు తన స్వగ్రామంలో చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పనిచేసి… తర్వాత డైరెక్టర్ అదే చిరంజీవి తో రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించాడు. ఇలాంటి అదృష్టం ద‌క్కించుకున్న‌ ఆ స్టార్ దర్శకుడు ఎవరో కాదు వివి.వినాయ‌క్‌.

వివి వినాయక్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలోని చాగల్లు. వినాయక్ చిన్నతనంలో వాళ్లకు సొంతంగా థియేటర్ ఉండేది. వినాయక్‌ చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవికి అభిమాని. చిరంజీవి సినిమా వచ్చిందంటే చాలు ఆ రోజు పెద్ద పండగగా సెలబ్రేట్ చేసేవాడు. వినాయక్‌ తండ్రి కృష్ణారావు కూడా రాజమండ్రిలో కొన్ని థియేటర్లను లీజుకు తీసుకొని నిర్వహించేవారు.

జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు వినాయక్ స్వగ్రామంలో పెద్ద హంగామానే చేశారట. ఆ సినిమా రిలీజ్ అయిన రోజు భారీ వర్షం కురుస్తుండడంతో కార్లు వేసుకుని చాగల్లు నుంచి రాజమండ్రి వరకు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. రాజమండ్రి లోని కుమారి టాకీస్ లో సినిమా చూసేందుకు తన తండ్రి నుంచి ప్రత్యేకంగా టిక్కెట్లు తెప్పించుకుని మరి సినిమా చూశామని వినాయక్ చెప్పారు.

ఆ తర్వాత వినాయక సినిమా రంగంలోకి వచ్చి ఆది సినిమాతో దర్శకుడిగా మారి తన మూడో సినిమా ఠాగూర్ తోనే తన అభిమాన హీరోని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఆ తర్వాత మరోసారి చిరంజీవి కం బ్యాక్‌ సినిమా ఖైదీ నెంబర్ 150 సినిమాకు కూడా వినాయక్ దర్శకత్వం వహించారు. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆ రోజుల్లోనే ఠాగూర్ 192 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇక పదేళ్ల గ్యాప్ తర్వాత చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీనెంబర్150 అయితే వంద కోట్లకు పైగా షేర్ కొల్లగొట్టింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news