Moviesఆ స్టార్ హీరో మొహానే అడిగేసాడు..చాలా బాధపడ్డ..సంచలన విషయాలను బయటపెట్టిన ఆర్టిస్ట్...

ఆ స్టార్ హీరో మొహానే అడిగేసాడు..చాలా బాధపడ్డ..సంచలన విషయాలను బయటపెట్టిన ఆర్టిస్ట్ కల్పలత..!!

కొన్ని సంవత్సరాలుగా ఊరించి ఊరించి సుకుమార్ ఎట్టకేలకు డిసెంబరు 17న బన్ని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పుతూ..పుష్ప సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసారు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద ఎలాంటి విజయం అందుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బన్నీ అభిమానులనే కాక అందరికి ఈ సినిమా బాగా నచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు సినిమా విజయానికి పెద్ద పీఠ వేశాయి. చంద్రబోస్ లిరిక్స్..దేవిశ్రీ మ్యూజిక్..సినిమాని మరోస్దాయికి ఎక్కించాయి.

ఇక సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఒక్క ఆర్టిస్ట్ తమ నటనకు మంచి మార్క్లులే వేయించుకున్నారు. బన్నీ, రష్మిక, కేశవ, పుష్ప రాజ్ తల్లిగా నటించిన ఆర్టిస్ట్ కల్పలత..ఈ సినిమా ద్వార మరింత గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఆర్టిస్ట్ కల్పలత గురించి. ఇప్పటికే ఈమె దాదాపు 55 చిత్రాలో, 10 సీరియస్ లో నటించింది. బాహుబలి,వివాహ భోజనంబు, అర్జున్ రెడ్డి, ఎక్ప్‌ ప్రెస్ రాజా, నేనే రాజు నేనే మంత్రి, భాగమతి, హిట్, గల్లీ రౌడి వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో కూడా సందడి చేసింది.

అయితే ఇన్ని సినిమాల్లో నటించిన కల్పలత కు ఇండస్ట్రీలో సరైన గుర్తింపు రానిది..పుష్ప సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా..ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో..కాల్ షీట్లు మొత్తం నింపేసుకుంది. బన్నీకి తల్లి పాత్రలో ఒదిగిపోయిందామె. ఎమోషనల్ సీన్లలో కళ్లు చెమ్మగిల్లేట్టు చేసింది.

ఇక ఈమె ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ..పుష్ప రాజ్ గా నటించిన బన్నీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు అభిమానులతో షేర్ చేసుకుంది. షూటింగ్ టైంలో బన్నీ దగ్గర నుండి చాలా నేర్చుకున్నాని చెప్పిన ఈమె తనకు కలవగానే ముందు బన్నీ ఆమె ఏజ్ అడిగారని చెప్పుకొచ్చింది.

ఆమె మాట్లాడుతూ..”షూటింగ్ టైంలో ఫస్ట్ టైం బన్నీ నన్ను చూడగానే “అమ్మా మీ ఏజ్ ఎంత” అని అడిగారని .. నేను 42 అని చెప్పా అని..దీంతో బన్నీ నాకు మీకు రెండు సంవత్సరాలే తేడా అని చెప్పాడని చెప్పుకొచ్చింది. ఇక ఆ తరువాత బన్నీ నా పిల్లల విషయాలు అడిగి తెలుసుకున్నారని..షూటింగ్ సెట్ లో బన్నీ ఉంటే ఆ సందడే వేరు అని తెలిపింది. తనకు ఇద్దరు కూతుర్లు అని చెప్పిన కల్పలత..ఏనాడు కూడా కొడు లేరని బాధపడలేదని..ఫస్ట్ టైం పుష్ప రాజ్ లాంటి కొడుకు ఉంటే బాగుండు అని..నాకు బన్నీ లాంటి కొడుకులేడే అని బాధపడ్డాను అని చెప్పుకొచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news