Moviesఎన్టీఆర్ - కొర‌టాల సినిమాపై రెండు గుడ్ న్యూస్‌లు... ఆ ఇద్ద‌రు...

ఎన్టీఆర్ – కొర‌టాల సినిమాపై రెండు గుడ్ న్యూస్‌లు… ఆ ఇద్ద‌రు హీరోయిన్లు ఫిక్స్‌..!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ భారీ అంచ‌నాల మ‌ధ్య సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7వ తేదీన థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఈ సినిమా ఆ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ఏకంగా 14 భాష‌ల్లో రిలీజ్ అవుతోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్ర‌చారంలో రామ్‌చ‌ర‌ణ్ బిజీగా ఉన్నాడు. సంక్రాంతి త‌ర్వాత స్మాల్ గ్యాప్ తీసుకుని కొర‌టాల శివ సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్ జాయిన్ అవుతాడు.

ఇక ఈ సినిమా గురించి రెండు అదిరిపోయే న్యూస్‌లు తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. మార్చి నుంచి కొర‌టాల – ఎన్టీఆర్ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఫిబ్ర‌వ‌రిలో కొర‌టాల డైరెక్ట్ చేసిన మెగాస్టార్ ఆచార్య రిలీజ్ అవుతోంది. ఆ వెంట‌నే ఎన్టీఆర్ కోసం కొర‌టాల రెడీ అవుతారు. ఇప్ప‌టికే స్క్రిఫ్ట్ వ‌ర్క్ కూడా చాలా వ‌ర‌కు కంప్లీట్ అయ్యింద‌ని టాక్ ? క‌రోనా స‌మ‌యంలోనే కొర‌టాల ఈ సినిమా క‌థ‌ను లాక్ చేసేశారు.

ఎన్టీఆర్ కెరీర్‌లోనే 30వ సినిమాగా ఇది తెర‌కెక్క‌నుంది. యువ సుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై సుధాకర్ మిక్కిలినేని, నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జై ల‌వ‌కుశ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్లో ఎన్టీఆర్ న‌టిస్తోన్న సినిమా ఇదే. ఇప్ప‌టికే ఎన్టీఆర్ – కొర‌టాల కాంబోలో జ‌న‌తా గ్యారేజ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ వ‌చ్చింది.

ఇక ఇప్పుడు మ‌రోసారి వీరి కాంబినేష‌న్ రిపీట్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి రెండో గుడ్ న్యూస్ ఏంటంటే పాన్ ఇండియా లెవ‌ల్లో ఈ సినిమా వ‌స్తోంది. ద‌ర్శ‌కుడు కొర‌టాల సైతం దీనికి సంబంధించి హింట్ ఇచ్చేశారు. మ‌రో ముచ్చ‌టైన న్యూస్ ఏంటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ ప‌క్క‌న పెళ్లిసందD ఫేమ్ శ్రీలీల సెకండ్ హీరోయిన్‌గా న‌టిస్తోంద‌ట‌. కియారా అద్వానీ మెయిన్ హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశాలున్నాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news