Moviesఅవకాశం ఇస్తానని పిలిచి ఆ  డైరెక్టర్ నన్ను అలా నిలుచోమన్నారు..నటి సంచలన...

అవకాశం ఇస్తానని పిలిచి ఆ  డైరెక్టర్ నన్ను అలా నిలుచోమన్నారు..నటి సంచలన వ్యాఖ్యలు..!!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు కమిట్‌మెంట్‌ ఇస్తేనే ఆఫర్లు వస్తాయా? నిర్మాతలతో హీరోయిన్లు టచ్‌లో ఉండాలా? వాళ్లకు లైంగికంగా హీరోయిన్లు సహకరించాలా? అంటే.. అవుననే అంటున్నారు కొందరు హీరోయిన్లు. క్యాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి ఇండస్ట్రీలో పేరుకుపోయిన అంశం. అయితే గత కొన్ని రోజులుగా అందరు స్టార్ హీరోయిన్లు తమకు క్యాస్టింగ్ కౌచ్ ఎదురైంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కూడా తమకు కూడా కాస్టింగ్ కౌచ్ ఎదురైంది అంటూ సంచలన సృష్టించారు . తమకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ గురించి మీ టూ ఉద్యమం పేరుతో అనేక విషయాలను బయటపెట్టిన పెద్ద దుమారమే రేపారు .

కాగా, ఇలాంటి ప్రాబ్లంస్ నే ఎదురుకున్నిందట బాలీవుడ్ బ్యూటీ సుర్వీన్ చావ్లా, బాలీవుడ్ చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి తన అందాల ఆరబోతతో కుర్రకారును మతిపోగొట్టిన బాలీవుడ్ హీరోయిన్ సుర్వీన్ చావ్లా గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. కాగా ఈ అమ్మడు తెలుగులో కూడా ఒక సినిమాలో నటించింది కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.

కాగా ఆమె ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ..దక్షిణాది పరిశ్రమకు చెందిన నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ దర్శకుడు తనని వేధించాడని .. అది మొదటి సారి కాదని బాలీవుడ్‌, సౌత్‌ పరిశ్రమలో దాదాపు అయిదు సార్లు తాను కాస్టింగ్‌ కౌచ్‌ను ఎదుర్కొన్నట్లు ఆమె ఆరోపించారు.

సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పి.. షూటింగు లొకేషన్ల ఎంపిక కోసం జరిగే రెక్కీ కోసం రమ్మని పిలిచి..ఓ స్టార్ డైరెక్టర్ నాతో మాట్లాడుతూ… నీ శరీరంలోని ప్రతీ అంగుళం గురించి నాకు తెలియాలి .. ఓ సారి బట్టలు విప్పి అటువైపు గా నిలుచో అనేసరికి నాకు మ్యాటర్ అర్ధమై నేను వెంటనే బయటకు వచ్చేసాను అని చెప్పిన ఆమె.. ఆ తరువాత అయన ఎన్ని సార్లు ఫోన్ కాల్స్ చేసిన అటెండ్ చేయడం మానేశాను అని సుర్వీన్ చావ్లా చెప్పారు. ఇక ఈ డైరెక్టర్ ఒక్కడే కాదు చాలా మంది నిర్మాతలు కూడా తనతో ఇలాగే బిహేవ్ చేసానని చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news