Movies'పుష్ప ' సెన్సార్ రిపోర్ట్‌... సూప‌ర్ టాక్‌... అదే డౌట్‌..!

‘పుష్ప ‘ సెన్సార్ రిపోర్ట్‌… సూప‌ర్ టాక్‌… అదే డౌట్‌..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెర‌కెక్కిన భారీ పాన్ ఇండియా సినిమా పుష్ప‌. రెండు పార్టులుగా తెర‌కెక్కిన ఈ సినిమా ఫ‌స్ట్ పార్ట్ డిసెంబ‌ర్ 17న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. కేవ‌లం టాలీవుడ్‌లో మాత్ర‌మే కాకుండా.. ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోన్న ఈ సినిమాపై ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, సింగిల్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది.

బ‌న్నీ శేషాచ‌లం అడ‌వుల్లో గంధ‌పు చ‌క్క‌ల స్మ‌గ్ల‌ర్‌గా క‌నిపిస్తున్నాడు. పుష్ప‌రాజ్ పాత్ర‌లో న‌టిస్తోన్న బ‌న్నీ ప‌వ‌ర్ ఫుల్ గా న‌టించిన‌ట్టు తెలుస్తోంది. ఇక సుకుమార్ టేకింగ్‌, బన్నీ మాస్ మేకోవ‌ర్ , ర‌ష్మి క గ్లామ‌ర్ అప్పీరి యెన్స్ , దేవిశ్రీ సంగీతం సినిమాకు హైలెట్ కానున్నాయి. ఇక సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతూ ఉండ‌డంతో బ‌న్నీ ఫ్యాన్స్ కోలాహాలం మామూలుగా లేదు.

ఇక తాజాగా పుష్ప సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ వారు యూ / ఏ స‌ర్టిఫికెట్ జారీ చేశారు. అయితే సినిమాలో కొన్ని సీన్ల‌కు సెన్సార్ వారు క‌త్తెర వేసిన‌ట్టు తెలిసింది. పుష్ప సినిమాలో కొన్ని అభ్యంత‌ర‌కర సీన్ల‌ను క‌ట్ చేయ‌డంతో పాటు కొన్ని డైలాగుల‌ను మ్యూట్ లో పెట్టాల‌ని సూచించార‌ట‌. అయితే టాక్ మాత్రం బాగుంద‌ని తెలుస్తోంది.

మ‌రి పుష్ప సినిమాలో సీన్లే సెన్సార్ క‌త్తెరకు వెళ్లాయంటే ఆ సీన్లు ఏంటి ? మ్యూట్ అయిన డైలాగులు ఏంటో చూద్దాం. ఏదేమైనా ముందు నుంచి ఈ సినిమా అనుకున్న టైంకు వ‌స్తుందా ? రాదా ? అన్న సందేహాల‌ను పుష్ప ప‌టాపంచ‌లు చేస్తోంది. అయితే ర‌న్ టైం 4 నిమిషాలు త‌క్కువుగా మూడు గంట‌లు ఉంద‌ని చెపుతున్నారు. ఇది బాగా ల్యాగ్ అవుతుందా ? అన్న సందేహాలు ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news