Moviesబాల‌య్య అంటే ఏపీ సీఎం జ‌గ‌న్‌కు అంత ఇష్ట‌మెందుకు...!

బాల‌య్య అంటే ఏపీ సీఎం జ‌గ‌న్‌కు అంత ఇష్ట‌మెందుకు…!

యువరత్న నందమూరి బాలకృష్ణ అంటే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి పిచ్చ ఇష్టం అంటూ ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే కాదు… ఈ ప్రచారం గత 20 ఏళ్ల ముందు నుంచే ఉంది. బాలకృష్ణ రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంతో సమర సింహారెడ్డి – నరసింహనాయుడు – చెన్న‌కేశ‌వ‌రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తీశారు. ముఖ్యంగా సమరసింహా రెడ్డి సినిమా త‌ర్వాత బాల‌య్య‌కు రాయలసీమలో విపరీతంగా అభిమానులు పెరిగిపోయారు. బాలయ్య సినిమాలు ఇష్టపడే రాజకీయ నాయకులు ఎంతోమంది ఉన్నారు.

ఈ క్రమంలోనే 1999 సంవత్సరం నుంచి కొద్ది సంవత్సరాల పాటు జగన్ కడప జిల్లా బాలయ్య అభిమానుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. బాల‌య్య యాక్ష‌న్ అన్నా, డైలాగులు చెప్పే విధానం అన్నా జ‌గ‌న్‌కు బాగా ఇష్ట‌మ‌ట‌. సమరసింహారెడ్డి – నరసింహనాయుడు – చెన్నకేశవరెడ్డి లాంటి సినిమాలు వచ్చినప్పుడు కడప జిల్లాలో బాలయ్య అభిమానులు… బాలయ్య సినిమాలు రిలీజ్ అయ్యే థియేటర్ల దగ్గర పెద్ద హడావిడి చేసేవారు. ఈ క్రమంలోనే బాలయ్య కటౌట్లు ముందు పొట్టేళ్లను బలి ఇవ్వడంతోపాటు అప్పట్లో పేపర్లలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చేవారు.

ఆ సమయంలోనే కడప జిల్లా బాలయ్య అభిమానుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న‌ జగన్ పేరుతో కూడా ప్రకటనలు వచ్చేవి. ఓవైపు బాలయ్య మరోవైపు అప్పుడు యువనేత జగన్ కటౌట్ ను కూడా పెట్టేవారు. ఆ ప్ర‌క‌ట‌న‌లే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూ ఉంటాయి. ఇక జగన్ సైతం చంద్రబాబును ఎన్నో సందర్భాల్లో విమర్శించినా బాలయ్యను ప‌న్నెత్తు మాట అనలేదు. బాలయ్య చాలా మంచివాడని ఆయనకు ఏం తెలియదని మెచ్చుకుంటూనే ఉంటారు.

రాజ‌కీయంగా చంద్ర‌బాబు, టీడీపీ వాళ్లు వైసీపీ వాళ్లంద‌రికి టార్గెట్ అయినా బాల‌య్య మాత్రం ఎప్పుడూ టార్గెట్ కారు. బాల‌య్య‌పై త‌న‌కు ఉన్న అభిమానాన్ని ప‌రోక్షంగా ఎప్ప‌టిక‌ప్పుడు చాటుకుంటూ ఉంటారు. తాజా విమర్శల నేపథ్యంలో కూడా బాలయ్యను వైసీపీ నేతలు ఎవరు విమర్శించలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news