Moviesలీకైన పునీత్ చివ‌రి క్ష‌ణాల్లోని వీడియో..ఎంత యాక్టివ్ గా ఉన్నాడో మీరే...

లీకైన పునీత్ చివ‌రి క్ష‌ణాల్లోని వీడియో..ఎంత యాక్టివ్ గా ఉన్నాడో మీరే చూడండి..!!

ఆ దేవుడు మంచి వాళ్లని త్వరగా తన దగ్గర కు తీసుకెళ్తాడు అంటాౠ మన పెద్ద వాళ్లు బహుశా ఇది నిజమే కావచ్చి అనిపిస్తుంది ఇప్పుడు అందరికి. క‌న్న‌డ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ స‌భ్యుల ప‌రిస్థితి అలాగే ఉంది. ఎంతో యాక్టివ్ గా ఉండే వ్యక్తికి ఇలా సడేన్ గా గుండె నొప్పి రావడం ఏంటి..అంతలోనే మరణించడం ఏంటి అంటూ షాక్ లో ఉన్నారు చిత్ర పరిశ్రమ.

ఇక శాండిల్‌వుడ్ స‌హా ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లోని అభిమానులు, ఇత‌ర న‌టీన‌టులకు ప‌రిస్థితి కూడా ఇలాగే ఉంది. శుక్ర‌వారం ఉద‌యం జిమ్ చేస్తున్న పునీత్ రాజ్‌కుమార్‌కు గుండె నొప్పి రావ‌డం, వెంట‌నే హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో ఆయ‌న సుదూర లోకాల‌కు వెళ్లిపోవ‌డం జ‌రిగింది. ఈ విషయాన్ని ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. అంద‌రూ ఆయ‌నతో ఉన్న మ‌ధుర స్మృతుల‌ను గుర్తు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే పునీత్‌ మరణానంతరం ఆయన చివరి ఘడియలకు సంబంధించిన వీడియోలు, ట్వీట్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

శుక్రవారం ఉదయం పునీత్ త‌న ఇంటి నుంచి కారు వరకు తానే స్వయంగా నడుచుకుంటూ వెళ్లడం వీడియోలో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. పునీత్‌ కారు ఎక్కిన వెంటనే భార్య ఒడిలో పడుకున్నారు. ఐదు నిమిషాల ప్రయాణం అనంతరం విక్రమ్ ఆసుపత్రికి చేరిలోపు భార్య ఒడిలోనే పునీత్ కన్ను మూశారు. ఈ వీడియోలో చాలా యాక్టివ్‌గా కనిపించిన అప్పు.. చివరి క్షణాలు ఇవే అంటూ అభిమానులు వైరల్‌ చేస్తున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ వీడియోలో అప్పుని చూస్తుంటే అందరి కళ్లు చెమ్మగిల్లితున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news