Moviesగంగ‌వ్వ కొత్త ఇంటికి ఎంత ఖ‌ర్చు పెట్టింది అంటే..!

గంగ‌వ్వ కొత్త ఇంటికి ఎంత ఖ‌ర్చు పెట్టింది అంటే..!

యూట్యూబ్ ఛానల్ స్టార్‌గా ఎంతో పాపులర్ అయింది గంగవ్వ. తెలంగాణకు చెందిన గంగ‌వ్వ‌ తెలంగాణ యాసలో ఎంతో అమాయకత్వంతో ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టి చెప్పేస్తూ ఉంటుంది. యూట్యూబ్ లో ఆమెకు వచ్చిన పాపులారిటీతో ఆమె ఏకంగా బిగ్ బాస్ 4వ సీజ‌న్ కంటెస్టెంట్ గా హౌస్ లో అడుగు పెట్టింది. కొన్ని వారాల పాటు హౌస్‌లోఎ ఎంతో సందడి చేసిన తర్వాత అనారోగ్యం కారణంగా హౌస్ నుంచి బయటకు వచ్చింది గంగవ్వ.

ఆమె హౌస్ లోకి వచ్చినప్పుడు తనకు సొంత ఇల్లు లేదని ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. అయితే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గంగవ్వకు సొంత ఇంటిని కట్టించి ఇచ్చే బాధ్యతను తాను తీసుకున్నారు. తాజాగా గంగవ్వ కొత్త ఇల్లు నిర్మాణం పూర్తయింది. తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లి గంగవ్వ నూతన ఇల్లు నిర్మాణం జరిగింది. ఈ క్రమంలోనే ఆమె గృహప్రవేశం చేయడంతో ఆమె కొత్త ఇంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక గంగవ్వ కొత్త ఇంటి నిర్మాణం కోసం మొత్తం 21 లక్షల రూపాయలు ఖర్చు అయిందట. బిగ్‌బాస్ ద్వారా గంగ‌వ్వ 11 లక్షలు గెలుచుకుంది. నాగార్జున ఏడు లక్షలు సాయం చేశారు. మరో మూడు లక్షలు అప్పు చేసి ఆమె తన సొంత ఇంటి కల నెరవేర్చుకుంద‌ని తెలుస్తోంది. ఆమె కొత్త ఇంటి ప్రవేశానికి అఖిల్ తో పాటు మై విలేజ్ షో స‌భ్యులు, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరయ్యారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news