Moviesడ్ర‌గ్స్ తీసుకుంటూ దొరికిపోయిన స్టార్ హీరోల భార్య‌లు వీళ్లే..!

డ్ర‌గ్స్ తీసుకుంటూ దొరికిపోయిన స్టార్ హీరోల భార్య‌లు వీళ్లే..!

ఇటీవ‌ల కాలంలో సినిమా ఇండ‌స్ట్రీని డ్ర‌గ్స్ ఉదంతాలు బాగా వెంటాడుతున్నాయి. టాలీవుడ్‌, బాలీవుడ్‌, శాండ‌ల్‌వుడ్ అన్న తేడా లేకుండా ప్ర‌తి ఇండ‌స్ట్రీలోనూ డ్ర‌గ్స్ తీసుకునే వారి పేర్లు బ‌య‌ట‌కు రావ‌డం, పోలీసులు విచారిస్తుండ‌డం జ‌రుగుతూ వ‌స్తోంది. ఇక బాలీవుడ్ వ‌ర్థ‌మాన హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత ఈ డ్ర‌గ్స్ ఉదంతాలు మ‌రిన్నిబ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

తాజాగా ప్ర‌ముఖ ఐటెం గ‌ర్ల్‌గా గుర్తింపు ఉన్న షెర్లిన్ చోప్రా మ‌రో బాంబు పేల్చింది. రెండు రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసింది. మ‌నోడు రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోయాడు. ఇదే పార్టీలో అమితాబ‌చ్చ‌న్ మ‌న‌వ‌రాలు కూడా ఉంద‌ని వార్తలు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో షెర్లిన్ చోప్రా రిలీజ్ చేసిన వీడియో వైర‌ల్ అవుతోంది. బాలీవుడ్‌లో ప‌లువురు సెల‌బ్రిటీలు సైతం విచ్చ‌ల‌విడిగా డ్ర‌గ్స్ వాడుతున్నార‌ని బాంబు పేల్చింది. షారుఖ్‌కు ఐపీఎల్లో కోల్‌కొతా నైట్ రైడ్స్ టీం ఉంది. గ‌తంలో ఓ మ్యాచ్‌లో అక్కడ షెర్లిన్ డ్యాన్స్ చేసింది. ఆ టైంలో తాను కొన్ని షాకింగ్ దృశ్యాల‌ను కూడా చూశాన‌ని షెర్లిన్ చెప్పింది.

తాను డ్యాన్స్ చేసి అల‌సిపోయాక వాష్‌రూమ్‌లోకి వ‌చ్చాన‌ని.. అయితే అక్క‌డున్న దృశ్యాలు చూసి నా మైండ్ బ్లాక్ అయిపోయింద‌ని చెప్పింది. అక్క‌డ స్టార్ హీరోల భార్య‌లు వాష్‌రూమ్ అద్దాల ముందు నుంచొని ఒక తెల్ల‌టి పౌడ‌ర్ పీలుస్తున్నార‌ట‌. త‌ర్వాత కాని ఆమెకు వాళ్లు డ్ర‌గ్స్ తీసుకుంటున్నార‌న్న విష‌యం అర్థం కాలేద‌ని సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట‌పెట్టింది.

 

అప్పుడు త‌న‌కు ఏం చేయాలో తెలియ‌క పోవ‌డంతో ఓ న‌వ్వు న‌వ్వి బ‌య‌ట‌కు వ‌చ్చేశాన‌ని. ఆ త‌ర్వాత షారుఖ్‌కు అత‌డి టీంకు తాను గుడ్ బై చెప్పేశాన‌ని చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news