Moviesవన్స్ స్టెప్‌ ఇన్‌ హిస్టరీ రిపీట్‌ .. బాలయ్య మళ్లీ ప్రూవ్...

వన్స్ స్టెప్‌ ఇన్‌ హిస్టరీ రిపీట్‌ .. బాలయ్య మళ్లీ ప్రూవ్ చేసాడుగా..!!

నందమూరి బాలకృష్ణను ఇప్పటి వరకు హీరోగా, రాజకీయ నాయకుడిగా చూశాం. ఇప్పుడు ఆయనలోని మరో కోణాన్ని ఆవిష్కరించబోతున్నారు నటసింహం. ఆహా ఓటీటీ కోసం హోస్ట్ గా మారబోతున్నారు. ‘అన్‌ స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే పేరుతో రానున్న ఈ షోకు సంబంధించి ఇప్పటికే ఫుల్ క్లారిటీ వచ్చేసింది. పక్కా తెలుగు ఓటిటి ‘ఆహా’లో త్వరలో ప్రారంభం కానున్న టాక్ షో “అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్బీకే”. నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ షోతో హీరో బాలకృష్ణ తన డిజిటల్ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో బాలయ్య ఎంట్రీ గురించి నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇప్పటి వరకు సినిమాల్లో పంచ్‌ డైలాగ్‌లతో సందడి చేసిన బాలయ్య ఇప్పుడు టాక్‌షో యాంకర్‌గా మారి తోటి తారలను ఎలా ప్రశ్నిస్తారో అని అందరు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో నటసింహం నందమూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండగా.. ‘ఆహా’  ప్రసారం కాబోతున్న టాక్ షో “అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే ”. ఇప్ప‌టికే విడుదలైన ఈ షో ప్రోమోతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చేశాడు బాల‌య్య‌. ఈ టాక్ షోకి ఇండ‌స్ట్రీ నుంచి ప‌లువురు సెల‌బ్రిటీలు అతిథులుగా రాబోతున్నట్లుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.

ఈ షోకు సంబంధించిన ప్రొమోను  యూట్యూబ్‌లో ఆహా విడుదల చేసింది.ఈ ప్రొమోలో బాలయ్య చేసిన అల్లరి, వ్యాఖ్యానించే విధానం అందరిని ఆకట్టుకుంటుంది. ఈ ప్రొమో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’లో మొదటి ఎపిసోడ్‌కు మంచు వారి ఫ్యామిలీని ఆహ్వానించారు బాలయ్య. బాలకృష్ణకు మంచు కుటుంబంతో మంచి ఫ్రెండ్‌షిప్ ఉన్న సంగతి తెలీసందే. దీంతో ఫస్ట్ ఎపిసోడ్ అంతా సరదాగా నవ్వులతో సాగిపోనుందని ప్రోమో చూస్తేనే అర్థమవుతోంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news