Moviesవిధి విచిత్రం: నిన్న య‌శ్‌తో డ్యాన్స్ చేసిన పునీత్‌.. వీడియో వైర‌ల్...

విధి విచిత్రం: నిన్న య‌శ్‌తో డ్యాన్స్ చేసిన పునీత్‌.. వీడియో వైర‌ల్ (వీడియో)

విధి ఎంత విచిత్ర‌మైంది అంటే ఎవ్వ‌రూ చెప్ప‌లేరు. అప్ప‌టి వ‌ర‌కు మ‌న క‌ళ్ల ముందు ఉన్న వారే మ‌రుక్ష‌ణ‌మే ఉండ‌రు. అప్ప‌టి వ‌ర‌కు అంతా క‌లిసి ఉన్న వారు ఎవ‌రి దారిలో వారు వెళ్ల‌గానే చ‌నిపోయిన సంద‌ర్భాలు ఉంటాయి. తాజాగా క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండె పోటుతో మృతి చెంద‌డంతో ఆయ‌న‌కు సంబంధించిన ప‌లు వీడియోలో ఈ రోజు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఆయ‌న‌తో త‌మ‌కు అనుబంధం ఉన్న సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన వారు, రాజ‌కీయ రంగాల‌కు చెందిన వారు పునీత్ తో తాము ఉన్న వీడియోల‌ను షేర్ చేస్తున్నారు. ఎంత విచిత్రం అంటే పునీత్ నిన్న క‌న్న‌డ రాక్ స్టార్ య‌శ్‌తో క‌లిసి ఓ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. ఆ ప్రోగ్రామ్‌లో య‌శ్ తో పాటు పునీత్ క‌లిసి స‌ర‌దాగా ఓ స్టెప్ వేశారు.

ఈ ప్రోగ్రామ్‌లో య‌శ్ మాట్లాడారు. అనంత‌రం య‌శ్‌, పునీత్ క‌లిసి ఎంతో హుషారుగా ఒకే స్టెప్ వేశారు. చాలా జోష్‌లో పునీత్ క‌నిపించారు. అలాంటిది ఈ రోజు పునీత్ ఇక లేడ‌న్న వార్త‌తో య‌శ్‌తో పాటు ఆయ‌న అభిమానులను తీవ్రంగా క‌లిచి వేసింది. నిన్న ప్రోగ్రామ్ వీడియోను వారు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ పునీత్‌కు త‌మ సంతాపం తెలుపుతున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news