Moviesబాలయ్య తో రొమాన్స్ చేయడానికి అన్ని కోట్లా..అమ్మడు బాగా ఎక్కువ చేస్తుందే..?

బాలయ్య తో రొమాన్స్ చేయడానికి అన్ని కోట్లా..అమ్మడు బాగా ఎక్కువ చేస్తుందే..?

బాలయ్య సరైన హిట్ కొట్టి చాలా కాలం అయింది. అలాగే బోయపాటి గత చిత్రం ‘వినయ విధేయ రామ’ భారీ డిజాస్టర్ అవటంతో హోప్స్ అన్నీ అఖండ పైనే పెట్టుకున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ తో అఖండ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమైంది. ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమా కరోనా దెబ్బతో చాలా ఆలస్యమైంది. ఇక పరిస్ధితులు అనీ అనుకూలిస్తే త్వరలోనే అఖండ తో బాలయ్య మన ముందుకు వచ్చేటట్లు కనిపిస్తుంది.

ఇక ఆ తరువాత బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబోలో ఓ సినిమా వస్తున్నట్లు తెలిసిందే. ణ్భ్ఖ్107 మూవీ డిసెంబర్ నుండి మొదలు కాబోతున్నట్లుగా టాక్ ఉంది. నవంబర్ లో పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టి.. డిసెంబర్ నుండి రెగ్యులర్ షూట్ కి వెళ్లేలా గోపీచంద్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో లేడీ విలన్ గా తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ని తీసుకు వస్తున్న.. గోపీచంద్ బాలకృష్ణ కోసం హీరోయిన్ ని సెట్ చేయడంలో మాత్రం చాలా కష్ట పడుతున్నట్లు తెలుస్తుంది.


త్రిష మొదలుకొని శ్రుతిహాసన్‌ వరకు పలువురు భామల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇందులో శ్రుతిహాసన్‌ నటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి ‘సలార్‌’లో నటిస్తున్న శ్రుతి.. బాలకృష్ణ సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం.

గోపీచంద్ మలినేని ఆఖరిసారిగా శృతిహాసన్ ని సంప్రదించగా. అప్పుడు సినిమా చేస్తానని కానీ అందు కోసం భారీ రెమ్యునరేషన్ ని డిమాండ్ చేసిందట. ఇంతకు అమ్మడు ఎంత డిమాండ్ చేసిందో తెలుసా..?? అక్షరాలా 2.5 కోట్లు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తన కన్నా రెట్టింపు వయసున్న హీరోలతో వర్క్ చేయనని చెప్పిన శృతి హాసన్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి నిజంగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా అనేది తెలియాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news