Moviesసాయిధరమ్ తేజ్ కిందపడ్డగానే ఇతను మొదట చేసిన పని అదేనట..అందుకే సేఫ్...

సాయిధరమ్ తేజ్ కిందపడ్డగానే ఇతను మొదట చేసిన పని అదేనట..అందుకే సేఫ్ అయ్యాడు..!!

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో కేబుల్ బ్రిడ్జ్, ఐకియా రూట్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్ర గాయాలు అవ్వడంతో సాయి ధరమ్ తేజ్‌ని వెంటనే దగ్గర్లోని మెడికవర్ ఆసుపత్రి లో ఎడ్మిట్ చేసారు. ఆ తరవాత అక్కడ నుండి అపోలో ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ఐసీయూలో ఆయన చికిత్స కొనసాగుతోంది. సరైన సమయంలో చికిత్స అందడం వల్లే సాయి ధరమ్‌ తేజ్‌కు ప్రాణాపాయం తప్పిందని తేజ్‌కు మొదట ట్రీట్‌మెంట్‌ చేసిన మెడికవర్‌ వైద్యులు తెలిపిన విషయం విధితమే. గోల్డెన్ అవర్‌లో అతన్ని ఆస్పత్రికి తీసుకురావడం, ఆ టైమ్‌లో ఇచ్చిన ట్రీట్‌మెంట్‌ వల్లే సాయి తేజ్‌ ప్రాణాలతో బయటపడ్డారన్నారు.

అయితే.. కేబుల్ బ్రిడ్జ్ మీద సాయిధరమ్ తేజ్ బైక్ కింద పడగానే ముందు ఎవరూ గుర్తు పట్టలేదు. కానీ.. అదే రోడ్డు మీద వెళ్తున్న ఓ వ్యక్తి వెంటనే స్పందించి సాయి ధరమ్ తేజ్ ను పైకి లేపాడు. అతడి పేరే అబ్దుల్. అమీర్ పేటలోని ఎల్లారెడ్డి గూడకు చెందిన అబ్దుల్ సీఎంఆర్ సంస్థలో వ్యాలెట్ పార్కింగ్ లో జాబ్ చేస్తుంటాడు. ప్రమాదం జరిగిన రోజు వేరే పని మీద నిజాంపేట వెళ్తున్నాడు. అబ్దుల్ జూబ్లీహిల్స్, కేబుల్ బ్రిడ్జ్ మీదుగా జేఎన్టీయూ వెళ్తున్న అబ్దుల్ అదే సమయంలో అక్కడ తన కండ్ల ముందే ప్రమాదం జరగడాన్ని చూసిన అబ్దుల్ వెంటనే డయల్ 100కు ఫోన్ చేశాడు. ఆ తర్వాత 108 అంబులెన్స్‌కు కూడా ఫోన్ చేశాడు.

10 నిమిషాల్లో అంబులెన్స్‌ రావడం దగ్గర్లోని మెడికోవర్‌ ఆస్పత్రికి తరలించడం వెంటవెంటనే జరిగిపోయాయి. అయితే అబ్దుల్‌ అంబులెన్స్‌లో సాయితో పాటు ఆస్పత్రికి కూడా వెళ్లాడు. అంతేకాదు ప్రమాదం జరిగిన ప్రాంతానికి కాస్త దూరంలో విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇస్లావత్ గోవింద్ కూడా యాక్సిడెంట్ అయిన వెంటనే స్పందించి.. ట్రాఫిక్ ను కంట్రోల్ చేయటం.. అంబులెన్సు సకాలంలో ఆసుపత్రికి చేరటంలో సాయం చేశారు. ఏదేమైన వారు స‌కాలంలో స్పందించడం వ‌ల‌నే ఈ రోజు సాయి తేజ్ సేఫ్‌గా బ‌య‌ట‌ప‌డ్డాడు అన్నది నిజం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news