Moviesవరుస ఫ్లాపుల్లో ఉన్న చిరంజీవికి ఊపిరి పోసిన సినిమా ఇదే..!!

వరుస ఫ్లాపుల్లో ఉన్న చిరంజీవికి ఊపిరి పోసిన సినిమా ఇదే..!!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. ఈ పేరు చెప్పగానే మనకు తక్కున గుర్తు వచ్చేది ఆయన సినిమాలోని అంటే పాటలు, డ్యాన్సులు, ఫైట్లు, కామెడీలు. నిజానికి చిరంజీవిని నెంబర్ వన్ స్ధానంలో నిలబెట్టింది ఈ అంశాలే. కానీ.. ఇవేమీ లేకుండా హీరోయిజం పక్కనపెట్టి చిరంజీవి ఓ బరువైన పాత్ర చేస్తే.. ఊహించడానికే కష్టమైన ఆలోచన అది. కానీ పరిస్థితుల నేపథ్యంలో చిరంజీవి కొత్త తరహా సినిమాలు చేయాల్సి వచ్చింది. అలాంటి సినిమాలకు నాంది పలికుతూ చేసిన సినిమానే ‘హిట్లర్’.

“హిట్లర్”.. సినిమా చిరంజీవి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవికి ఓ సర్టైన్ టైంలో వరుస ఫ్లాపులు పడ్డాయి. దీంతో దిక్కుతోచక.. ఎలాంటి సినిమా చేయాలో తేల్చుకోలేక దాదాపు సంవత్సరం పాటు సినిమాలుకు బ్రేక్ తీసుకున్నాడు. సరిగ్గా ఆ టైంలోనే ఈ హిట్లర్ సినిమా చేసె అవకాశం చిరు కి వచ్చింది. మళయాళంలో మమ్ముట్టి హీరోగా వచ్చిన హిట్లర్ సినిమా అక్కడ సూపర్ హిట్ అయింది. ఇక ఆ సినిమాని తెలుగులో రిమేక్ చేసారు. నిజానికి ఇది రీమేక్ సినిమా అయినా కూడా తెలుగు ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లు ఈ కథను మార్చి బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు చిరంజీవి. అయితే ఈ సినిమా వెనక చాలా పెద్ద కథ ఉంది.

ఇక ఈ సినిమా రైట్స్ ని ఎడిటర్ మోహన్ తీసుకుని తెలుగులో ఎవరితో తీయాలి అని ఆలోచిస్తున్నపుడు మొదటిగా వచ్చిన పేరు హీరో మోహన్ బాబు. ఇక ఈవీవీ సత్యనారాయణ ఈ మూవీని డైరెక్ట్ చేయాలని కూడా అనుకున్నరట. అయితే మరుధూరి రాజా ఈ విషయం మీద ఈవీవీని అడగడం ఆయన నో చెప్పడం జరిగిపోయిందట. ఆ తరువాత ఈ సినిమా చిత్రంగా చిరంజీవి వద్దకు వెళ్ళింది. ఆయన కెరీర్ లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news